కళా తపస్వీ విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, జయప్రదల కాంబినేషన్లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రం ‘ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో ‘సాగర సంగమం’. తమిళంలో ‘సలంగై ఓలి’, మలయాళంలో ‘సాగర సంగమం’ గా ఒకే రోజు విడుదల అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . (Twitter/Photo)
శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం ,‘సాగర సంగమం’. ముందుగా ఈ చిత్రానికి వేరే పేరు అనుకున్నారు. ఐతే.. ఏడిద నాగేశ్వరరావు ‘సీతాకోకచిలుక’ సినిమాకు ముందుగా ‘సాగర సంగమం’ టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చివరగా సీతాకోకచిలుక ఫైనల్ చేశారు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ఏడిద నాగేశ్వరరావు దగ్గరే ఉంది. ముందుగా ఈ చిత్రానికి ‘మహా మనిషి’తో పాటు పలు టైటిల్స్ పరిశీలనకు వచ్చాయి. చివరగా ‘సీతాకోకచిలుక’ సినిమా కోసం అనుకున్న ‘సాగర సంగమం’ టైటిల్ ఈ చిత్రానికి పెట్టారు. (twitter/Photo)