శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ చేస్తూ వినోదం పంచుతున్న రష్మీ.. వెండితెరపై కూడా అదే ట్రాక్ లో వెళ్ళడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా చేసిన ఈ యంగ్ లేడీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా రష్మీ చేతిలో ఉన్నాయని సమాచారం.