అది అలా ఉంటే కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మరోసారి సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. Photo : Twitter
అంతేకాదు చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేసింది. అంతేకాదు సమంత దక్షిణ కొరియాకు వెళ్లడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. Photo : Twitter
సరైనా సమాచారం లేకుండా సమంత ఆరోగ్యం గురించి ఇలా రూమర్స్ వ్యాప్తి చేయడంపై టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. సమంత తన అనారోగ్యం నుంచి కోలుకుని ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటోందని, దయచేసి ఎవరూ అటువంటి పుకార్లు నమ్మవద్దని సమంత టీమ్ తెలిపినట్లు సమాచారం. దీంతో సమంత హెల్త్ విషయంలో వచ్చిన రూమర్స్‌కు చెక్ పడినట్లు అయ్యింది. Photo : Twitter
సమంత యశోద సినిమా విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు హరి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. Photo : Twitter
ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 10 కోట్ల షేర్, 18 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుపుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 14 కోట్ల షేర్, 31 కోట్ల గ్రాస్ వచ్చింది. యశోద సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద బరిలోకి దిగగా.. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో దాదాపుగా 2 కోట్ల రేంజ్లో లాభాన్ని సాధించిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. Photo : Twitter
క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. Photo : Instagram
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ మొదటి వారంలలో షూటింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డికెలతో సమంత చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. చూడాలి మరి ఇది ఎలా ఆకట్టుకోనుందో.. Photo : Instagram
మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆ డేట్‌కు రావడం లేదని తెలిపారు ప్రోడ్యూసర్స్. దీంతో సమంత ఫ్యాన్స్ కొంత అప్ సెట్ అవుతున్నారు. అసలు విషయానికి వస్తే.. నవంబర్ 4 నాటికి ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడం లేదని... (Twitter/Photo)
దీనికి తోడు ఈ సినిమాను 3D ఫార్మాట్లో విడుదల చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. ఈ నేపథ్యంలో 3డి వర్క్స్‌కి మరింత సమయం అవసరం ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే కొత్త తేదీని ఇంకా ప్రకటించేదు.. దీనికి సంబంధించి త్వరలో కొత్త విడుదల తేదిని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. (Twitter/Photo)
దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించాడు. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటించింది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. దేవ్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. దుష్యంతుడిగా గుర్రం ఎక్కి వస్తున్న ఆయన లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. Photo : Twitter
ఈ పోస్టర్లో అడవిలో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా మరియు పరాక్రమంగా కనిపిస్తున్నాడు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్‌తో ఒక్కసారిగా హిందీలో కూడా పాపులర్ అయిన సామ్ ఈ సిరీస్ తర్వాత వరుస అవకాశాలను అందుకొంటూ వస్తున్నారు. దీనికి తోడు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కారణంగా అటు హిందీ మాస్ ప్రేక్షకులకు దగ్గరైయారు సమంత. దీంతో సమంత హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటూ అక్కడి రకరకాల షోల్లో పాల్గోంటున్నారు. Photo : Twitter
సమంత గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆయుష్మాన్ ఖురానా సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హిందీ దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారట. ఆయన గతంలో ‘స్త్రీ’ అనే హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. Photo : Instagram
అయితే ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కూడా స్త్రీ సినిమా వలే హారర్ చిత్రం అని, ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని టాక్. జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో సమంత.. రాజ్ పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రలోను కనిపించనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ ఎందుకు చక్కగా హీరోయిన్ పాత్రలు వేసుకోవచ్చుగా.. ప్రయోగాలు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.. Photo : Instagram
సమంత గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముంబైలో 30 కోట్లతో ఓ భారీ ఇల్లును తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంద్రభవనం లాంటీ ఆ ఇల్లు బీచ్ వ్యూతో ఉంటూ.. సకల సదుపాయాలతో ఉంటుందని సమాచారం. ఎంతో ఇష్టపడి సమంత ఈ ఇల్లును తీసుకుంటున్నట్లు వినికిడి. ప్రస్తుతం సమంత హిందీలో సూపర్ బిజీగా మారుతున్నారు. Photo : Instagram