ఈ రోజుల్లో ఓ సినిమాకు సరిపోయే టైటిల్ పెట్టాలంటే తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా కథకు సెట్ అయ్యే టైటిల్ దొరక్కపోతే పిచ్చెక్కిపోతుంది. అయితే ఇప్పటికే ఎంతోమంది దర్శకులు చిరంజీవి సినిమాల కోసం అదిరిపోయే టైటిల్స్ పెట్టారు. సింపుల్‌గా ఇప్పుడు వాటినే ఈ తరం దర్శక నిర్మాతలు వాడేస్తున్నారు. చిరంజీవి సినిమాలే కాదు.. ఆయన పాత టైటిల్స్ కూడా అభిమానులకు బాగా ఇష్టమే. ఫ్యాన్స్ కంటే కూడా మన దర్శక నిర్మాతలకు కూడా చిరు ఓల్డ్ టైటిల్స్ అంటే భలే యిష్టం. అందుకే ఇప్పటి సినిమాలకు చాలా వరకు చిరు టైటిల్స్ వాడేసుకుంటున్నారు.
ఇప్పటికే దాదాపు 15 సినిమాలు చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చాయి. అందులో చాలా వరకు నిరాశ పరిచాయి. చిరు టైటిల్స్ ఇప్పటి హీరోలకు పెద్దగా కలిసిరావడం లేదు. కానీ మరికొందరికి మాత్రం అవే బాగా కలిసొస్తున్నాయి. గతేడాది కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క కూడా నిరాశ పరిచింది. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
1. రుద్రవీణ: ఇదిలా ఉంటే ఇప్పుడు రుద్రవీణ అంటూ మరో సినిమా కూడా వచ్చేస్తుంది. కొత్త వాళ్లు ఈ సినిమాను చేస్తున్నారు. మధుసూధన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటీనటులు నటిస్తున్నారు. రఘు కుంచె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ఊరుబాగు కోసం పాటు పాడే ఓ యువకుడి కథతో బాలచందర్ చేసిన క్లాసిక్ సినిమా ఇది. ఇప్పుడు రుద్రవీణ టైటిల్ ఈ తరం దర్శకులు వాడేసుకుంటున్నారు.