Home » photogallery » movies »

RRR VS GANGUBAI KATHIAWADI ALIA BHATT GANGUBAI KATHIAWADI MOVIE BEATS RRR MOVIE AT THE INTERNATIONAL MARKET FIRST PLACE GOT KGF 2 TA

RRR : ఆ ఏరియాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టిన ఆలియా భట్ గంగుబాయి కతియావాడి..

RRR Vs Gangubai Kathiawadi | 2022లో ఆరు నెలల పూర్తైయ్యాయి. ఈ ఆరు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక బాలీవుడ్‌ బాక్సాఫీస్ రిపోర్ట్ గమనిస్తే.. మూడు హిట్లు.. 6 ఫ్లాపులు అన్నట్లు సాగింది. ఈ యేడాది ఎలంటి అంచనాలు లేకండా విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ బాలీవుడ్‌లో తొలి హిట్‌గా సంచలన విజయం సాధించింది. అటు గంగుబాయి కతియావాడి, భూల్ భులయ్యా సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అటు దక్షిణాది డబ్బింగ్ సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఉత్తరాదిన సత్తా చాటాయి.