దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది. Photo : Twitter
కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా టీవీలో ప్రీమియర్‌గా రానుంది. ఈ సినిమా స్టార్ మాలో ఆగస్టు 14న ప్రీమియర్‌గా రానుందని ఓ ప్రోమోను వదిలారు టీమ్.. దీంతో ఈ సినిమాను మరోసారి టీవీలో కూడా చూడోచ్చని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి అక్కడ ఎంత రేటింగ్‌ను తెచ్చుకుంటుందో.. ఇక్కడ మరో విషయం ఏమంటే ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ కూడా ఇదే రోజునా జీ సినిమాలో సాయంత్రం ప్రసారం కానుంది. Photo : Twitter
తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన RRR దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపుగా ఉన్న అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. ఇక మరోవైపు ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. సౌత్ భాషలకు సంబంధించి జీ5లో.. అటు హిందీకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్’లో ట్రెండ్ అవుతోంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఈ ముగ్గురు మరోసారి చేతులు కలపనున్నారని తెలుస్తోంది. గాసిప్ ఏమిటంటే, ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాత RRR థీమ్2తో కూడిన రెస్టారెంట్‌ను ప్రారంభించాలని ఈ త్రయాన్ని సంప్రదించారట. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓకే అనగా.. రాజమౌళి నుంచి కూడా ఆమోదం పొందినట్లు వినిపిస్తోంది. దీంతో అతి త్వరలో ఆర్ ఆర్ ఆర్ థీమ్‌తో వరల్డ్ క్లాస్ రెస్టారెంట్ ప్రారంభంకానుందని అంటున్నారు. అలా ఈ ముగ్గురు కలిసి మరొక కొత్త వ్యాపారంలోకి దిగబోతున్నారు. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) సినిమా విషయానికి వస్తే.. ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఎట్టకేలకు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి అప్డేట్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడు శివ కొరటాలతో చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. Photo : Twitter
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల టీమ్ ఓ వీడియోను వదిలింది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు అనిరుధ్ మ్యూజిక్ కూడా ఏ ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.Photo : Twitter
దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిశీలిస్తున్నారట టీమ్. అందులో భాగంగా రష్మిక మందన్నతో ఎన్టీఆర్ 30 టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత అందించనున్నారు. Photo : Twitter
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసారట. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. Photo : Twitter
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడిచిన.. సమ్మర్‌కు వస్తోందని తాజా టాక్. ఇక తాజాగా ఈ సినిమా వైజాగ్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. Photo : Twitter
ముందుగా ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు తాజాగా ‘అధికారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. Photo : Twitter
ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో ఈ మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం Photo : Twitter
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. Photo : Twitter
మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా శంకర్ సినిమా తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తోంది. Photo : Twitter