RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజురికార్డు బ్రేక్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.ఈ వేడుకు రాజమౌళి,ఎన్టీఆర్, రామ్ చరణ్, త్రివిక్రమ్ సహా మిగతా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. (Twitter/Photo)
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపిలో మొదటి రోజు రూ. 74.11 కోట్ల షేర్ రాబట్టింది. మరోవైపు బాహుబలి 2 మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 43 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రెండు బాహుబలి 2 రూ. 14.80 కోట్ల వసూళు చేస్తే.. పెరిగిన రేట్లతో ఆర్ఆర్ఆర్ రెండో రోజు.. 31.63 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్స్ తన పేరిట లిఖించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్ పాల్గొన్నారు. (Twitter/Photo)
[caption id="attachment_1260796" align="alignnone" width="1365"] ఇక ఆర్ఆర్ఆర్ మూవీ మూడో రోజు ఏకంగా రూ. 33.53 కోట్ల షేర్ వసూళు చేస్తే బాహుబలి 2 సినిమా మాత్రం రూ. 16.60 కోట్ల వసూలు చేసింది. ఇక నాల్గో రోజు ఆర్ఆర్ఆర్ రూ. 17.73 కోట్ల షేర్ అందుకుంది. అటు బాహుబలి 2 మూవీ 14.65 కోట్లు వసూళు చేసింది. ఈ రకంగా ఐదో రోజు ఈ సినిమా రూ. 13.63 కోట్ల షేర్ అందుకుంది. అదే ‘అల వైకుంఠపురములో’ సినిమా మాత్రం 5వ రోజున రూ. 13.63 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఈ రకంగా వరుసగా ఐదు రోజులు తెలుగు రాష్ట్రల్లో ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేసింది. (Twitter/Photo)
నైజాంలో ఈ సినిమాను 70 కోట్లకు కొంటే ట్రేడ్ సైతం ఆశ్చర్య పోయింది. ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్‌ను 6 రోజుల్లో బ్రేక్ చేసింది. అంతేకాదు 12వ రోజు ఈ సినిమా తెలంగాణ గడ్డపై రూ. 100 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. అటు ఏపీ, రాయలసీమలో కలిపి రూ. 150 కోట్ల షేర్‌కు దగ్గరగా ఉంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. (Twitter/Photo)
బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయేలా కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. మొన్న శని, ఆది వారాలు ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. వీక్ డేస్‌లో కాస్త వెనకబడింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉండటం.. ఇద్దరికి అదిరిపోయే మార్కెట్ ఉండటం.. దానికి తోడు రాజమౌళి అనే బ్రాండ్ సినిమాకు మరింత హెల్ప్ అవుతోంది. (Twitter/Photo)