RRR US Premiers : గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. బడా హీరోల సినిమాలకు అక్కడ ఈ క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. కొన్ని సినిమాలకు ఏకంగా ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్స్ ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. బాహుబలి సినిమాతో అక్కడ ఈ క్రేజ్ పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. తాజాగా విడుదలైన ’ఆర్ఆర్ఆర్’ యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఎంత రాబట్టింది. ఓవరాల్‌గా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే.. (Twitter/Photo)
RRR మూవీ యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారానే రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి దర్శకుడు కావడం.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
Bahubali 2 | ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2’. ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులకు ఎక్కడమే కాక.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లు వసూళు చేసి నెంబర్ వన్ ప్లేస్ నుంచి 2 స్థానంలోకి వచ్చింది. (Twitter/Photo)
అజ్ఞాతవాసి | పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ మూవీ కూడా ఓవరాల్‌గా రూ. 124.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా అందరి అంచనాలు తల కిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారా 1.51 మిలియన్ డాలర్లు వసూళు చేసి మూడో ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
బాహుబలి 1 | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి ఫస్ట్ పార్ట్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా 1.36 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి నాల్గో స్థానంలో ఉంది. (Twitter/Photo)
స్పైడర్ | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా .. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ. 124.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో అంతగా వర్కౌట్ కానీ ఈ సినిమా తమిళంలో మాత్రం మంచి బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్లో 1 మిలియన్ డాలర్లు వసూళు చేసి ఆరో ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
రాధే శ్యామ్ | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓవరాల్‌గా ఫస్ట్ డే రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక తెలుగు వెర్షన్ ‘రాధే శ్యామ్’ ప్రీమియర్స్ ద్వారా 904 K డాలర్స్ వసూళు చేసిన ఏడో ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
భరత్ అను నేను | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భరత్ అను నేను’. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్స్ ద్వారా 850 K డాలర్లు వసూళు చేసి 8వ ప్లేస్‌లో ఉంది. (Twitter/Phjoto)
అరవింద సమేత వీర సమేత | ఎన్టీఆర్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా విడుదలకు ముందు రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్ ద్వారా 797 K డాలర్లు వసూళు రాబట్టి 12వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
సరిలేరు నీకెవ్వరు | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా 763 K డాలర్లు ప్రీమియర్స్ ద్వారా రాబట్టి 13వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)