RRR | ఆర్ఆర్ఆర్ విడుదలకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమాను ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమాను ఐమాక్స్, డాల్బీలతో పాటు సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. విడుదలకు ముందు వీలైనంతగా దుబాయ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాకు ఓవర్సీస్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో సాలిడ్‌గా ప్లాన్ చేస్తున్నారు అక్కడి డిస్ట్రీబ్యూటర్స్. ఆర్ ఆర్ ఆర్ ఒక్క అమెరికాలోనే కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 1150 లోకేషన్స్‌లో విడుదలకు ప్లాన్ చేశారు. అంటే ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్లో అక్కడ విడుదలకాలేదని అంటున్నారు. (Twitter/Photo)
మొత్తంగా మార్చి 24న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీని వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని 1920 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఇద్దరు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. వీళ్లిద్దరి గురువు పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించారు. (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. (Twitter/Photo)