రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇక ఈ సినిమా గత యేడాది అక్టోబర్ నెలలో జపాన్ దేశంలో జపనీస్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. (RRR in Japan Twitter) (RRR in Japan Twitter)
కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక మన దేశంలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ 5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక జపనీస్ భాషల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెగ ప్రమోషన్ చే సారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. Photo : Twitter
ఇప్పటికే RRR మూవీలోని నాటు నాటు పాటకు గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ రాగా.. ఇక నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చేసిన నాటు నాటు పాటను చంద్రబోస్ పాట రాయగా.. కీరవాణి స్వరాలు అందించారు. ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అద్భుతంగా పాట పాడారు. ఈ పాట తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రియులను అలరించింది. దక్షిణ భారత దేశం కాదు కాదు మన దేశం నుంచి నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే ప్రథమం. .Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ) సినిమాలవి నామినేట్ అయ్యాయి. చూడాలి మరి ఆస్కార్ అవార్డ్ ఏ పాటకు రానుందో.. ఇక నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ పేర్లను ప్రకటించింది అకాడమీ టీమ్. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డులలో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బొంబాయి (1988), లగాన్ (2001) చిత్రాలున్నాయి. ఈ అద్భుతమైన సాధించినందుకు ఆర్ఆర్ఆర్ బృందాన్ని అభినందిస్తున్నారు నెటిజన్స్. ఇక నాటు నాటు మిగితా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా లేదా అనేది మార్చి 13న తెలుస్తుంది. నాటు నాటుతో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్...ది ఎలిఫెంట్ విస్పర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్...అల్ ది బ్రీత్స్, ఇలా మూడు విభాగాల్లో ఇండియన్ సినిమాలు నామినేట్ అయ్యాయి. ఒకేసారి మూడు భారతీయ చిత్రాలు నామినేట్ కావడం ఇదే మొదటిసారి. Photo : Twitter
ఇక మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా నామినేట్ అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే ఆయన పేరు లీడ్ యాక్టర్ కేటగిరిలో నామినేట్ కాలేదు. ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ పొందే ఆస్కారం ఉందని ప్రచురించింది ప్రముఖ అమెరికన్ పబ్లికేషన్ 'యుఎస్ఎ టుడే'. అమెరికాకు చెందిన ఈ పత్రిక తన కథనంలో రాస్తూ.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ ఆస్కార్ పోటీదారుగా ఉండబోతున్నాడని జోస్యం చెప్పింది అయితే అలాంటిదేమి జరుగలేదు. Photo : Twitter
ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్. ఇంత తక్కువుగా వస్తాదని ఊహించలేదని అప్ సెట్ అవుతున్నారు ఫ్యాన్స్.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమాకు ఇది బెస్ట్ రేటింగ్ అని చెప్పాలి. Photo : Twitter
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాను అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత అక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు.ఇందులో భాగంగా రాజమౌళి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆక్కడి మీడియా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానమిచ్చారు. (Twitter/Photo)
RRR సీక్వెల్ పై రాజమౌళి స్పందిస్తూ.. తను తెరకెక్కించే ప్రతి సినిమాకు మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే మా నాన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించడం పక్కా అని చెప్పొచ్చు. (Twitter/Photo)
జపాన్‌లో ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా జపాన్ కరెన్సాలో చారిత్రక 1 బిలియన్ యెన్స్‌ను సొంతం చేసుకుంది. మన కరెన్సీలో రూ. 61.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే అక్కడ ముత్తు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. . (Twitter/Photo)
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేసారు. ఇక జపాన్ ప్రేక్షకులు చాలా మంది ఇది వరకు ఓటీటీలో సబ్ టైటిల్స్‌లో చూసేసారు. అలాంటి సినిమాకు అక్కడ ఈ రేంజ్ వసూళ్లు రావడం మాములు విషయం కాదనే చెప్పాలి. రూ. 1152.40 కోట్ల గ్రాస్ వసూళ్లకు రూ. 61.60 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిపితే.. రూ. 1214 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (Ram Charan and Upasana enjoys japan food Twitter)
నైజాం (తెలంగాణ): రూ. 111.85 కోట్లు /రూ . 70 కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 51.04 కోట్లు / రూ. 37 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 36.40 కోట్లు / రూ. 22 కోట్లు ఈస్ట్: రూ. 16.24 కోట్లు / రూ. 14 కోట్లు వెస్ట్: రూ. 13.31 కోట్లు /రూ. 12 కోట్లు గుంటూరు: రూ. 18.21 కోట్లు / రూ. 15 కోట్లు కృష్ణా:రూ. 14.76 కోట్లు / రూ. 13 కోట్లు నెల్లూరు: రూ. 10.50 కోట్లు / రూ. 8 కోట్లు Telagana - AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్ )
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.
కర్ణాటక: రూ. 44.50 కోట్లు (రూ 83.40 కోట్లు గ్రాస్) / రూ. 41 కోట్లు తమిళనాడు: రూ. 38.90 కోట్లు (రూ. 77.25 కోట్లు గ్రాస్) / రూ. 35 కోట్లు కేరళ: 11.05 కోట్లు (24.25 కోట్లు గ్రాస్) / రూ. 9 కోట్లు హిందీ: 134.50 కోట్లు (రూ. 326 కోట్లు గ్రాస్) / రూ. 92 కోట్లు రెస్టాఫ్ భారత్ : రూ.9.30 కోట్లు (రూ. 18.20 కోట్ల గ్రాస్) / రూ. 8 కోట్లు ఓవర్సీస్: రూ. 102.50 కోట్లు(రూ. 206 కోట్ల గ్రాస్) / రూ. 75 కోట్లు) వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1152.40 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు).. జపాన్ రూ. 61.60 కోట్లు కలిపితే.. ఈ సినిమా రూ. 1214 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. (Twitter/Photo)
త్వరలో ఆర్ఆర్ఆర్ మూవీ చైనాలో కూడా విడుదల కానుంది. అక్కడ ఈ సినిమా ఆకట్టుకుంటే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా మన దేశ ప్రేక్షకులతో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)