కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక మన దేశంలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక జపనీస్ భాషల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెగ ప్రమోషన్ చే సారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చి.. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ స్వయంగా ప్రయత్నాలను ప్రారంభించింది. Photo : Twitter
అందులో భాగంగా బెస్ట్ మోషన్ పిక్చర్ - నిర్మాత దానయ్య, బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి.., బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్ - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- అజయ్ దేవగణ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - అలియా భట్, బెస్ట్ సినిమాటోగ్రఫీ- కేకే సెంథిల్ కుమార్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నాటు నాటు, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్- ఎంఎం కీరవాణి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - రమా రాజమౌళి, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్, బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ - నల్ల శ్రీను, సేనాపతి నాయుడు, బెస్ట్ సౌండ్ - రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస్ మోహన్ కేటగిరీలో ఆస్కార్ కోసం పోటీలో నిలపనున్నారు. Photo : Twitter
ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది... అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్. ఇంత తక్కువుగా వస్తాదని ఊహించలేదని అప్ సెట్ అవుతున్నారు ఫ్యాన్స్.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమాకు ఇది బెస్ట్ రేటింగ్ అని చెప్పాలి. Photo : Twitter
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత అక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు.ఇందులో భాగంగా రాజమౌళి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆక్కడి మీడియా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానమిచ్చారు. (Twitter/Photo)
RRR సీక్వెల్ పై రాజమౌళి స్పందిస్తూ.. తను తెరకెక్కించే ప్రతి సినిమాకు మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే మా నాన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించడం పక్కా అని చెప్పొచ్చు. (Twitter/Photo)
తాజాగా జపాన్‌లో ఈ సినిమా రెండు వారాలకు గాను జపాన్ కరెన్సాలో 135 మిలియన్ యెన్స్‌ను సొంతం చేసుకున్నట్టు అక్కడ బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా అక్కడ ఈ సినిమా 304 M యెన్స్‌ను కలెక్ట్ చేసింది. అంటే మన దేశ కరెన్సీలో రూ. 17 కోట్లు అన్నమాట. ఇప్పటికే బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అక్కడ ఈ సినిమాను దాదాపు 2 లక్షల మంది వీక్షించారు. మరో రూ. 9 కోట్లు రాబడితే.. ముత్తు పేరిట ఉన్న రికార్డు క్రాస్ చేసే అవకాశాలున్నాయి. మరో వారం పది రోజుల్లో ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
ఏది ఏమైనా అప్పటి కరెన్సీలో ముత్తుకు రూ. 28 కోట్లు అంటే మాములు విషయం కాదు. ఇపుడు ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసినా.. పెద్దగా చెప్పుకోవాల్సిన పని కూడా ఉండదు. అప్పటి రెవెన్యూతో పోలిస్తే.. ఆర్ఆర్ఆర్ ఇంకా రూ. 100 కోట్లు రాబట్టినా.. ముత్తు రికార్డు బ్రేక్ చేసినట్టు కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేసారు. ఇక జపాన్ ప్రేక్షకులు చాలా మంది ఇది వరకు ఓటీటీలో సబ్ టైటిల్స్‌లో చూసేసారు. అలాంటి సినిమాకు అక్కడ ఈ రేంజ్ వసూళ్లు రావడం మాములు విషయం కాదనే చెప్పాలి. (Ram Charan and Upasana enjoys japan food Twitter)
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రతిష్ఠాత్మకమైన సాటర్న్ అవార్డు అందుకున్న ఈ చిత్రం తాజాగా సన్‌సెట్ సర్కిల్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఈ అవార్డు గెలుచుకుంది.బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం నాలుగు చిత్రాలతో పోటీ పడి ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే ఈ చిత్రం తాజాగా సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్‌ను గెలుచుకుందని తెలుస్తోంది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్ లో RRR బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, అవార్డ్స్ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు రెండో సాటర్న్ అవార్డు అంటూ తెలిపారు. మొదటి అవార్డు బాహుబలి1కు వచ్చింది. Photo : Twitter
ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చి.. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున ఆస్కార్ బరిలోకి నిలిపింది. దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ స్వయంగా ప్రయత్నాలను ప్రారంభించింది. Photo : Twitter