RRR As Malli | ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మల్లి నటించింది. ఈమె చుట్టే కథ అంతా నడుస్తోంది. ఇక ఈ సినిమాలో గోండు పిల్ల మల్లి పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరనే విషయం అందరు వెతుకుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు ? రాజమౌళి ఎందుకు ఆ అమ్మాయిని ఏరికోరి తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. (Twitter/Photo)
RRR సినిమా కథ ఈ మల్లి చుట్టే తిరుగుతోంది. సినిమా ప్రారంభంలో వాళ్ల దగ్గర బానిసగా ఈ మల్లిని తీసుకెళుతారు. ఈమెను వాళ్ల చెర నుంచి విడిపించడానికి కొమరం భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీకి వెళతారు. అయితే మల్లిని విడిపించడానికి కొమరం భీమ్ వస్తోన్న సంగతి తెలుసుకున్న బ్రిటిష్ వాళ్లు అతన్ని పట్టుకునే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ అయిన అల్లూరి సీతారామరాజు( రామ్ చరణ్)కు అప్పగిస్తారు. (File/Photo)
ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. అయితే ఈ సినిమా గోండు పిల్ల మల్లి పాత్ర చేసింది ఎవరు ? రాజమౌళి ఈ అమ్మాయిని ఎక్కడ నుండీ పట్టుకొచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ మల్లి పాత్రలో నటించిన ఈ అమ్మాయి అసలు పేరు ట్వింకిల్ శర్మ. గతంలో ఈమె డాన్స్ ఇండియా డాన్స్ వంటి రియాలిటీ షోతో పాపులర్ అయింది. ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రామా బాజ్‌లో చివరి 8 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచింది. (Twitter/Photo)
ఈమె అనేక టీవీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. అంతేకాదు ఫ్లిప్ కార్డ్ వంటి యాడ్‌లో కూడా నటించింది. ఈమె రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమా మొదలైనపుడు ఈమె 8వ తరగతి చదువుతూ ఉండేదట. ఇపుడు ఇంటర్మీడియట్‌కు వచ్చినటట్టు సమాచారం. ఈ సినిమాతో మల్లి పాత్రలో నటించిన ట్వింకిల్ శర్మకు మంచి గుర్తింపే లభించింది. (File/Photo)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత మల్లి గురించి అందరు గూగుల్‌లో వెతికేస్తున్నారట. ఈ సినిమాను దర్శకత్వం వహించిన రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల గురించి అందరికీ తెలిసిందే కదా. కానీ ఈ పిల్ల ఎవరో అద్భుతంగా చూసిందనే టాక్ వినిపించింది. ఇక హిందీలో రియాలిటీ షోస్ చూసే ప్రేక్షకులకు మాత్రం ఈమె పరిచయమే. (File/Photo)
ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకోగా.. అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్‌ను అందుకుంది. అయితే ఇండియాకు సంబంధించి ఈ రికార్డ్ అందుకున్న రెండో సినిమాగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. ఇక ఈ రికార్డ్ అందుకున్న మరో సినిమా బాహుబలి 2. ఇక్కడ విశేషం ఏమంటే ఈ రెండు సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవే. (Twitter/Photo)
ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌తో పాటు 3D, డాల్బీ అట్మాస్ వంటి అధునాతన ఫార్మాట్స్‌లో స్క్రీనింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సౌలభ్యం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండనుందట. ప్రీమియం ఫార్మాట్ అయిన డాల్బీ విజన్, సినిమార్క్ XD ప్రదర్శనలు USAలో మొదటి వారం మాత్రమే ఉండనున్నాయట. దీంతో ఈ ఫార్మాట్స్‌లో సినిమా చూడటానికి ఇంకా రెండు రోజులే ఉంది. రెండవ వారం నుండి రెగ్యులర్/స్టాండర్డ్ ఆర్ ఆర్ ఆర్ ప్రింట్ ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. మొత్తంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మల్లి పాత్రధారి ‘ట్వింకిల్ శర్మ మరింత పాపులర్ అయింది. (File/Photo)