RRR | రౌద్రం రణం రుధిరం (Rise Roar Revolt) కట్ చేస్తే RRR .. గతేడాది ఇదే రోజు (25/3/2022) విడుదలై ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. అంతేకాదు మన దేశానికి పూర్తి స్థాయిలో తొలి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన సినిమాగా RRR మూవీ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఒక యేడాదిలో RRR మూవీ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్లో అందరు నోళ్లలో నానుతూనే ఉంది. ఈ సినిమా సాధించిన వసూళ్లు.. రికార్డుల విషయానికొస్తే..
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన నాటు నాటు డాన్స్‌కు మన భారతీయులే కాదు.. ప్రపంచ ప్రేక్షకులు కూడా దాసోహం అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటకు డాన్స్ మూమెంట్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్‌కు మంచి పేరు వచ్చింది. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నాటు నాటు పాటకు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అతికినట్టు సరిపోయింది. ఈ పాటను రాసిన చంద్రబోస్, బాణీలు సమకూర్చిన కీరవాణికి ఆస్కార్ దాసోహం అయింది.
ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయి గౌరవం దక్కడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం. దక్షిణ భారత దేశం కాదు కాదు మన దేశం నుంచి నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే ప్రథమం. అంతేకాదు ఒక పూర్తి స్థాయి భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డు రావడం ఇదే ప్ర ప్రథమం అని చెప్పాలి. ఉత్తమ చిత్రం విభాగంలో కాకుండా .. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ అవార్డు రావడం పై దేశ వ్యాప్తంగా అందరు హర్షిస్తున్నారు.
ఆస్కార్ సహా ఈ నాటు నాటు పాటకు మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. “RRR” నుండి “నాటు నాటు” 9 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది: 1. అకాడమీ అవార్డు - ఉత్తమ ఒరిజినల్ పాట 2. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 3. క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ – ఉత్తమ పాట 4. హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ - ఉత్తమ ఒరిజినల్ సాంగ్ 5. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 6. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ - ఉత్తమ సంగీతం 7. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ – ఉత్తమ ఒరిజినల్ స్కోర్ 8. పండోర ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ – బెస్ట్ సాంగ్ కంపోజింగ్ 9. ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్.
ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట నామినేషన్ పొందింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. వీటిలో నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది.
RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా సంచలనాలు యేడాదైన ఆగడం లేదు. ఇప్పటికే ఈ సినిమా మన ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డును ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం గర్వకారణం. ఈ సినిమా ఓటీటీ వేదికలతో పాటు టీవీల్లో సత్తా చాటుతూనే ఉంది. (Twitter/Photo)
దర్శక బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ మన దేశ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం జక్కన్న మాయాజాలానికి ఫిదా అయ్యారు. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా పలు అవార్డులను గెలుస్తూ దూసుకుపోతుంది. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan), హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై వరల్డ్ వైడ్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. (Twitter/Photo)
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్‌లను రివార్డ్‌లను దక్కించుకుంటోంది. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్‌కు కూడా గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది..మన భారతీయులు తెరకెక్కించిన చిత్రం పాట అక్కడ లైవ్ పర్ఫామెన్స్ చేయడం విశేషమనే చెప్పాలి. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. కీరవాణి స్వరాలు సమకూర్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద స్క్రీన్ పై ఈ సినిమాను ప్రదర్శించారు. (Twitter/Photo)
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ అన్ని అమ్ముడు పోయాయి. అంతేకాదు అతిపెద్ద తెరపై స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమాను చూడటానికి అంతర్జాతీయ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ సినిమాను తెలుగు వెర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రదర్శిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా రీ రిలీజ్ చేస్తే కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీల్లోనే కాదు.. టీవీల్లో ప్రసారమైన ప్రతి సారీ మంచి టీఆర్పీ రాబడుతూనే ఉంది. ఇక ఈ సినిమా మొదటి సారి టీవీల్లో ప్రసారమైనపుడు 19.62 TRP సాధించింది. ఆ తర్వాత 2వ సారి ప్రసారమైతే.. 8.02 టీఆర్పీ.. 3వ సారి 6.37 టీఆర్పీ.. 4వ సారి.. 4.14 టీఆర్పీ సాధించింది. తాజాగా ఐదోసారి స్టార్ మాలో ప్రసారమైనపుడు 8.17 టీఆర్పీ సాధించింది. రెండు, మూడు, నాలుగోసారి ప్రసారమైన దాని కంటే ఎక్కువ టీఆర్పీ రావడం విశేషం.
మొత్తంగా థియేటర్స్‌తో పాటు ఓటీటీల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేసిన ప్రేక్షకులు అటు టీవీల్లో ప్రసారమైనపుడు కూడా అదే స్థాయి రెస్పాన్స్ దక్కించుకోవడం మాములు విషయం. ఒకపుడు థియేట్రికల్ రిలీజ్ తర్వాత శాటిలైట్ టీవీల్లో ప్రసారమయ్యేది. ఇపుడు వివిధ వేదికల్లో ప్రసారమైవుతోంది. ఈ నేపథ్యంలో టీవీల్లో 5వ సారి ప్రసారమైనపుడు కూడా ఈ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
RRR మూవీకి కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక మన దేశంలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ 5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక జపనీస్ భాషల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెగ ప్రమోషన్ చే సారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అక్కడ 1400 మిలియన్ యెన్స్ కలెక్షన్స్ రాబట్టింది. Photo : Twitter
RRR ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు వారాల్లోపే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా జపాన్ కలెక్షన్స్ కలిపి ఓవరాల్‌గా రూ. 1236.50 కోట్లు గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మూడో ప్లేస్నుంచి రెండో ప్లేస్‌కి ఎగబాగింది.