ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటం పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను ఊర్రూత లూగిస్తున్న ఈ సినిమా జర్నీ ఎలా మొదలైందంటే.. (Twitter/Photo)
నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నందమూరి, మెగా హీరోలతో మల్టీస్టారర్ అనగానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
ఆ తర్వాతా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళి ఆహ్వానం మేరకు ఆయన పిలుపుతో ఇద్దరం కలిసి వెళ్లామన్నారు. కథ కూడా వినకుండా ఆ ఫోటో దిగామన్నారు. ఆ తర్వాత కథ విని కాఫీ తాగామన్నారు. అలా ఆర్ఆర్ఆర్ కథ మొదలైంది. 2018 మార్చి 22న ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో హ్యాష్‌ట్యాగ్ ను క్రియేట్ చేసారు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ అంటే.. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అంటూ ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరాలతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కు పేరు పెట్టామన్నారు. ఆ తర్వాత అదే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టినట్టు చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు చేయాలని అందరి దర్శకులకు ఓ కల ఉంటోంది. కానీ రిరవ్స్లో రాజమౌళితో సినిమా చేయడానికి అగ్ర హీరోలను తన చుట్టూ క్యూ కట్టేలా చేసి నిజంగానే దర్శక బాహుబలిగా నిలిచారు. ఇక రాజమౌళి నుంచి పిలుపు రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథ వినకుండా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. జక్కన్న తమతో సినిమా చేయడమే తమ భాగ్యంగా భావించే స్థితిలో టాలీవుడ్ అగ్ర హీరోలున్నారు. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ సినిమాను హైదరాబాద్, పూణె, గుజరాత్, ఉక్రెయిన్, బల్గేరియా తదితర దేశాల్లో పిక్చరైజ్ చేశారు. ఇక ఇద్దరు బడా హీరోలతో రాజమౌళి ఎలాంటి కథతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ 2019 మార్చి 14న ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు చరిత్రలో కలవని ఇద్దరు యోధులు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పినక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి మీడియా సమావేశంలో వెల్లడించారు. (Twitter/Photo)
ముందుగా ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్టార్డమ్ వెనక రాజమౌళి సింహాద్రి, మగధీర సినిమాలే కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు. (Twitter/Photo)
ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ సినిమా నాలుగు రిలీజ్ డేట్స్ తర్వాత 2022 మార్చి 25న ఈ సినిమా ఎట్టకేలకు మరికాసేట్లో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియో మోరీస్, విలన్ పాత్రల్లో రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ నటిస్తున్నట్టు 19 నవంబర్ 2019న ఈ సినిమాలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నిప్పులాంటి అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తే.. నీరు లాంటి ఎక్కడైన కలిసిపోయే నీటి లాంటి కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. (Twitter/Photo)
మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో ఆటూ పోట్లను ఎదుర్కొని ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కెరీర్లో తొలిసారి.. వరుసగా 2019, 2020, 2021 మూడు కాలండర్ ఇయర్స్‌లో సినిమా విడుదల కాకపోవడం.. మరోవైపు రామ్ చరణ్‌కు 2020,2021లో ఏ సినిమా విడుదలకు నోచుకోకపోవడం ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకత అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో హీరోగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా నాలుగేళ్ల ఈ ప్రయాణానికి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)