ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సహా హాలీవుడ్ నటీనటులు తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా కోసం తెర ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ ఎంత కష్టపడ్డారో.. తెర వెనక రాజమౌళి సహా ఎంతో టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారు. (Twitter/Photo)
అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. జక్కన్న బాలీవుడ్ హీరోలతో తన తర్వాతి ప్రాజెక్ట్ అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. నందమూరి, మెగా హీరోలను కేవలం తన మాటతో ఒకే సినిమాలో నటింప జేసేలా ఒప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి సుమారు రూ. 350 కోట్లతో అనుకున్న బడ్జెట్.. కరోనా ఇతరత్రా ప్రమోషన్స్ అన్ని కలిపి ఫైనల్‌గా రూ. 500 కోట్లు అయినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో పాల్గొన్న సాంకేతిక నిపుణుల సంఖ్య 3000 దాకా ఉంటారు. ఈ చిత్రానికి 9 మంది కో డైరెక్టర్స్ పనిచేశారు. చిత్రీకరణ కోసం 300 రోజులకు పైగా సమయం పట్టింది. ఈ సినిమాకు ముందు రిహార్సల్ కోసం 200 రోజుల సమయం కేటాయించారు. ముందుగా 240 రోజులను టార్గెట్‌గా పెట్టుకొని రంగంలోకి దిగిన జక్కన్న.. క్వాలిటీ ఔట్పుట్ కోసం మరో 60 రోజులు పైగా సమయం ఎక్కువగా తీసుకున్నారు. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ, అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఇక గండిపేట దగ్గర డిల్లీ సెట్లో కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు. ఔట్ డోర్ విషయానికొస్తే.. వికారాబాద్, గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్, ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. (Twitter/Photo)
రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు .. క్లైమాక్స్‌ను పిక్చరైజ్ చేశారు. బల్గేరియాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాలను షూట్ చేశారు. అక్కడే తారక్.. పులితో పోరాడే సీన్స్‌ను తెరకెక్కించారు. ఇక ఉక్రెయిన్‌లోని ‘రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్’లో నాటు నాటు పాటను పిక్చరైజ్ చేసారు. ఈ పాటను డాన్స్ డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. (Twitter/Photo)
ఈ బైక్ గురించి రాజమౌళి చాలా రీసెర్చ్ చేసాడు. ఎందుకంటే 1920ల్లో ఈ తరహా బండ్లు ఉన్నాయా లేవా అని ఆయన చాలా వెతికిన తర్వాత.. దీన్ని సిద్ధం చేయించాడు. బ్రిటన్ కంపెనీ అయిన దీని హెడ్ ఆఫీసు బర్మింగ్ హామ్లో ఉంది. 1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేది ఈ బైక్. అప్పట్లోనే 350 సీసీ, 500 సీసీ బైకులను తయారు చేసింది ఈ కంపెనీ.