తాజాగా ఈ సినిమాను మే 20 నుంచి ఈ సినిమా జీ 5లో పే ఫర్ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై సబ్స్క్రైబర్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో జీ5 వెనక్కి తగ్గింది. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఎప్పటిలాగా ఎక్స్ట్రా మనీ లేకుండా ఈ సినిమాను చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
అక్కడ ఈ సినిమా ఓవరాల్‌గా మంచి లాభాలనే తీసుకొచ్చింది. ఈ సినిమా అక్కడ రూ. 11 కోట్ల షేర్ రాబట్టి. ఓవరాల్‌గా ఈ సినిమా అక్కడ రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. ఒకవేళ కేజీఎఫ్ 2 విడుదల కాకపోయి ఉంటే.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ మరింత మెరుగ్గా ఉండేదని చెబుతున్నారు. ఏమైనా అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాకటలో రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే..రూ. 44.50 కోట్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా రూ. 83.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తంగా రూ. 2.50 కోట్ల లాభాలను తీసుకొచ్చి లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా ఈ సినిమా కర్ణాటకలో ఓవరాల్‌గా హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. (Twitter/Photo)
ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.. Photo : Twitter
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. Photo : Twitter