Home » photogallery » movies »

RRR RAJAMOULI JR NTR RAM CHARAN RRR FIRST RECORD BREAK COLLECTIONS KARNATAKA DAY 1 TOP TELUGU MOVIES SHARE TA

RRR : ఆ ఏరియాలో బాహుబలి 2 రికార్డ్స్‌ను టచ్ చేయలేకపోయిన ఆర్ఆర్ఆర్.. మొత్తంగా ఎన్నో ప్లేస్ అంటే..

RRR : ప్రభాస్‌తో బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో రాజమౌళి రేంజ్ పెరిగింది. ఈయన సినిమా వస్తుందంటే ఆటోమేటిక్‌గా అంచనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో నందమూరి, మెగా హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కించిన మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఈ సినిమా అంచనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. మరి ఆ అంచనాలతో పాటు ఈ సినిమా గత కొన్నేళ్లుగా కొన్ని సినిమాలు ఫస్ట్ డే సెట్ చేసిన రికార్డులను చాలా చోట్ల బద్దలు కొడుతుంది. కానీ ఈ ఏరియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. వివరాల్లోకి వెళితే..