RRR | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కువగా జపిస్తోన్న పేరు ‘ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడి.. ఈ నెల 25న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దుబాయ్‌లో ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు కర్ణాటకలో స్పెషల్ ఈవెంట్ చేస్తోంది. అక్కడ ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ కానుంది. (Twitter/Photo)
నాటు నాటు అంటూ ఇరగదీసే స్టెప్పులతో అభిమానులకు కన్నుల పండగ చేయించారు తారక్, చరణ్. ఈ ఇద్దరి డాన్సులు చూస్తుంటే కడుపు నిండిపోయింది అభిమానులకు. ఈ లిరికల్ సాంగ్ చూసిన తర్వాత అభిమానులు గాల్లో గంతులేస్తున్నారు. రౌద్రం రణం రుథిరంలో చరణ్, ఎన్టీఆర్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది ఆర్ఆర్ ఆర్. ఈ సినిమాకు ఓవర్సీస్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో సాలిడ్‌గా ప్లాన్ చేస్తున్నారు అక్కడి డిస్ట్రీబ్యూటర్స్. ఆర్ ఆర్ ఆర్ ఒక్క అమెరికాలోనే కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 1150 లోకేషన్స్‌లో విడుదలకు ప్లాన్ చేశారు. అంటే ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్లో అక్కడ విడుదలకాలేదని అంటున్నారు.
ఈ రోజు కర్ణాటకలోని చికబళ్లాపూర్లో కర్నాటకకు సంబంధించిన ప్రీ రిలీజ్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరు కానున్నారు. మార్చి 20న ఆర్ఆర్ఆర్ టీమ్.. బరోడా.. ఆ తర్వాత ఢిల్లీ.. మార్చి 21న పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్‌లో..మార్చి 22న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాతో పాటు వారణాసీలో ప్రీ రిలీజ్ రిలీజ్ వేడుకల్లో భాగంగా ప్రచారం నిర్వహించనున్నారు. (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. (Twitter/Photo)
పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దాదాపు 400 కోట్లతో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంపై అభిమానులు, చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)