RRR : ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ పలు అంతర్జారీయ అవార్డులు ఈ సినిమాకు వరించాయి. ఇప్పటికే ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయింది. (Twitter/Photo)
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారతీయ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ అభిమానులను సైతం మెప్పించింది. ఇప్పటికే ఉత్తమ దర్శకుడి విభాగంలో న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. రీసెంట్గా ఈ అవార్డును రాజమౌళి తన భార్య రమాతో కలిసి అందుకున్నారు. ఈ వేడుకకు జక్కన్న పంచ కట్టులో హాజరై అభిమానులను అలరించారు. (Twitter/Photo)
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ సహా పలు ప్రాంతాల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ 5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. Photo : Twitter
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ యేడాది మన దేశం తరుపున ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరు భావించారు. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ అభిమానులకు నిరాశే ఎదురైంది. (File/Photo)
ఆస్కార్ బరిలో అధికారిక ఎంట్రీ సాధించకపోయినా.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేషన్ దక్కించుకుంటారనే దానిపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్వితీయ నటన కనబరిచారు. ఆస్కార్‌కు మన దేశం తరుపున నామినేట్ కాకపోవడంతో చిత్ర యూనిట్ స్వయంగా ఈ సినిమాను ఆస్కార్‌కు పంపించారు. తాజాగా 2023లో ఆస్కార్ బరిలో ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్టులో ఒక్క విభాగంలో నామినేట్ అయింది. (File/Photo)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాల బైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్యాన్ ఇండియా ఆయా భాషల్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఈ పాటకు కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకుంటాడా అనేది చూడాలి. ఫస్ట్ భారతీయ పాట ఈ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. ఆర్ఆర్ఆర్కు ఈ ఒక్క విభాగంలో నామినేట్ కావడంపై అభిమానులు ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, దర్శకుడు విభాగాల్లో నామినేట్ కాలేకపోయింది. ఫైనల్ లిస్ట్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచి గెలుస్తుందా అనేది చూడాలి. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ఈ సినిమా బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుకు నామినేట్ అయింది. ఇంగ్లీష్ భాషేతర విభాగంలో ఉత్తమ చిత్రంగా పోటీ పడనుంది. అలాగే మన దేశం నుంచి ‘ల్ దట్ బ్రీత్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో పోటీ పడనుంది. ఫిబ్రవరి 19న విన్నర్లకు పురస్కారాలను అందజేయనున్నారు. (Twitter/Photo)
అటు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’, పొన్నియన్ సెల్వన్ -1’ చిత్రాలు సత్తా చాటాయి. 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయింది. పొన్నియన్ సెల్వన్ ఆరు విభాగాల్లో నామినేట్ అయింది. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం మార్చి 12న హాంగాంగ్‌లో జరగనుంది. (NTR and Ram charan Twitter)
ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది... అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్. ఇంత తక్కువుగా వస్తాదని ఊహించలేదని అప్ సెట్ అవుతున్నారు ఫ్యాన్స్.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమాకు ఇది బెస్ట్ రేటింగ్ అని చెప్పాలి. Photo : Twitter
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాను అమెరికాలోని చికాగోలో ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత అక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు.ఇందులో భాగంగా రాజమౌళి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆక్కడి మీడియా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానమిచ్చారు. (Twitter/Photo)
RRR సీక్వెల్ పై రాజమౌళి స్పందిస్తూ.. తను తెరకెక్కించే ప్రతి సినిమాకు మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే మా నాన్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించడం పక్కా అని చెప్పొచ్చు. (Twitter/Photo)
జపాన్‌లో ఈ సినిమా విడుదలై మూడు నెలలు పూర్తి కావొచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా జపాన్ కరెన్సాలో 425 M మిలియన్ యెన్స్‌ను సొంతం చేసుకున్నట్టు అక్కడ బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మన కరెన్సీలో రూ. 27 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే అక్కడ ముత్తు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. . (Twitter/Photo)
ఏది ఏమైనా అప్పటి కరెన్సీలో ముత్తుకు రూ. 27కోట్లు అంటే మాములు విషయం కాదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూసేసారు. ఇక జపాన్ ప్రేక్షకులు చాలా మంది ఇది వరకు ఓటీటీలో సబ్ టైటిల్స్‌లో చూసేసారు. అలాంటి సినిమాకు అక్కడ ఈ రేంజ్ వసూళ్లు రావడం మాములు విషయం కాదనే చెప్పాలి. (Ram Charan and Upasana enjoys japan food Twitter)
నైజాం (తెలంగాణ): రూ. 111.85 కోట్లు /రూ . 70 కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 51.04 కోట్లు / రూ. 37 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 36.40 కోట్లు / రూ. 22 కోట్లు ఈస్ట్: రూ. 16.24 కోట్లు / రూ. 14 కోట్లు వెస్ట్: రూ. 13.31 కోట్లు /రూ. 12 కోట్లు గుంటూరు: రూ. 18.21 కోట్లు / రూ. 15 కోట్లు కృష్ణా:రూ. 14.76 కోట్లు / రూ. 13 కోట్లు నెల్లూరు: రూ. 10.50 కోట్లు / రూ. 8 కోట్లు Telagana - AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్ )
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.
కర్ణాటక: రూ. 44.50 కోట్లు (రూ 83.40 కోట్లు గ్రాస్) / రూ. 41 కోట్లు తమిళనాడు: రూ. 38.90 కోట్లు (రూ. 77.25 కోట్లు గ్రాస్) / రూ. 35 కోట్లు కేరళ: 11.05 కోట్లు (24.25 కోట్లు గ్రాస్) / రూ. 9 కోట్లు హిందీ: 134.50 కోట్లు (రూ. 326 కోట్లు గ్రాస్) / రూ. 92 కోట్లు రెస్టాఫ్ భారత్ : రూ.9.30 కోట్లు (రూ. 18.20 కోట్ల గ్రాస్) / రూ. 8 కోట్లు ఓవర్సీస్: రూ. 102.50 కోట్లు(రూ. 206 కోట్ల గ్రాస్) / రూ. 75 కోట్లు) వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1150.10 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు).. జపాన్ రూ. 27 కోట్లు కలిపితే.. ఈ సినిమా రూ. 1179.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే ఈ చిత్రం తాజాగా సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్‌ను గెలుచుకుంది. . 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్ లో RRR బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, అవార్డ్స్ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బాహుబలి 1కు రాజమౌళికి సాటర్న్ అవార్డు వరించింది Photo : Twitter
తాజాగా ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఈ సినిమా 2022 జాతీయ అవార్డుల్లో ఈ సినిమానే ఎక్కువగా గెలిచే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఒక తెలుగువాడు నిర్మించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ యవనిక పై సత్తా చాటాడం మాములు విషయం కాదు. ఈ సినిమా ముందు ముందు మరిన్ని అవార్డులు అందుకున్న ఆశ్చర్యపోవాాల్సిన పనిలేదు. (Twitter/Photo)