RRR Roudram Ranam Rudhiram : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మరి కాసేపట్లో ఈ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబడుతోంది. పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేసారు కూడా. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ డే ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటే.. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగులో ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. నార్త్‌తో పాటు మిగిలిన భాషల్లో ఓ మోస్తరు అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా అదరగొట్టేలా ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షో టిక్కెట్స్‌ను అభిమానులు రూ. 3 వేలు నుంచి 5 వేల మధ్య కొనుగోలు చేసి మరి చూస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ ఫస్డ్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 85 నుంచి రూ. 80 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్టు ఈ సినిమా బుకింగ్స్ రిపోర్ట్స్ చూస్తే చెప్పొచ్చు. ఇక కర్ఱాటకలో ఈ సినిమా రూ. 12 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో రూ. 7 నుంచి 8 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. కేరళలో ఈ సినిమా రూ. 2 కోట్ల వరకు రాబట్టే అవకాశాలున్నాయి. హిందీలో ఫస్ట్ టాక్ షో బట్టి.. మొదటి రోజు రూ. 16 నుంచి రూ. 18 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొదటి రోజు భారత దేశంలో రూ. 120 కోట్ల నుంచి రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (Twitter/Photo)
ఇక విదేశాల్లో ఓవర్సీస్లో ఈ సినిమా రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 165 కోట్ల నుంచి రూ. 170 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చెబుతున్నాయి. కరోనా పాండమిక్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి. (Twitter/Photo)