ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై కొత్త సినిమా వస్తుందంటే సందడి మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో ఓటిటిలు లేవు.అప్పట్లో విడుదలైన బడా హీరోల సినిమాలు చాలా నెల తర్వాత పండగ వంటి రోజుల్లో ప్రసారం చేసేవారు. పైగా అప్పట్లో ప్రేక్షకుల చేతికి ఒరిజినల్ ప్రింట్ అంత తేలిగ్గా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఎలాంటి సినిమా అయినా.. ఎంత పెద్ద హీరో అయినా నెల రోజుల్లోనే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. టీవీలో వచ్చే వరకు కూడా సినిమాను చూడకుండా ఆగడం లేదు ప్రేక్షకులు.(File/Photo)
11. ఆర్ఆర్ఆర్ (RRR) : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ తొలిసారిగా 19.62 రేటింగ్ సాధించింది. ఇది ఒక రకంగా తక్కువే అయినా.. ఇప్పటికే ఈ సినిమా చాలా మంది థియేటర్స్‌తో పాటు ఓటీటీ వేదికలైన జీ 5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్‌లో చూసేసారు. దాదాపు థియేటర్, ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ రోజుల్లో ఈ మాత్రం టీఆర్పీ సాధించడం అంటే అది మాములు విషయం కాదు. ఇక రాబోయే రోజుల్లో టీవీల్లో ప్రసారమయ్యే చిత్రాలకు ఈ మాత్రం రేటింగ్స్ వస్తాయా లేవా అనేది చూడాలి. (Twitter/Photo)