ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దుబాయ్‌లో ప్రీ రిలీజ్ వేడుక తర్వాత ఈ శనివారం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం బస్వరాజ్ బొమ్మైతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పని చేసిన తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను జక్కన్న పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటకతో పాటు తెలుగు ప్రజలు హాజరయ్యారు. వారి హోరు చూస్తుంటే.. ఒకప్పటి శ్రీ కృష్ణదేవరాయలు సామ్రాజ్యం ఇలాగే ఉండదేమో అన్నట్టు అనిపిస్తోంది. తెలుగు, కన్నడ ప్రజల బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆకాక్షించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతించిన తెలంగాణ,ఏపీ ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. మరోవైపు టికెట్ రేట్స్ పెంపు కోసం కృషి చేసిన గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ బాగు కోసం ఆయన తగ్గారు. చివరకు చిత్ర పరిశ్రమను గెలిపించారన్నారు. మీరు ట్రూ మెగాస్టార్. ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా గౌరవిస్తానన్నారు. (Twitter/Photo)
నేను సినిమా చేస్తానని అడిగిన వెంటనే.. కథ కూడా అడగకుండా.. ఈ సినిమా కోసం తమ ప్రతి అణువును ఈ సినిమా కోసం పెట్టిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. రామ్ చరణ్.. హనుమంతుడు లాంటి వారు.. ఆయన బలం ఏంటో తనకు తెలియదన్నారు. నందమూరి హరికృష్ణకు తారక్ అని ఎందుకు పేరు పెట్టారో.. తన బలం తెలిసిన మహనీయుడు రాముడు.. అలాగే తన బలం ఏంటో తెలిసిన నటుడు అన్నారు. ఈ సినిమాలో నా రాముడుగా .. తారక్.. భీముడుగా అలరించరన్నారు. (Twitter/Photo)