RRR - Oscar: ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా అంతర్జాతీయ యవనికపై మెరిసింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకోవడం భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఇక రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు కీరవాణి సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి.
రాజమౌళి దర్శకత్వం కీరవాణి స్వరకల్పనలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. అన్న కీరవాణి ఆస్కార్ వెనక తమ్ముడు రాజమౌళి కృషి ఉంది.
సినీ ఇండస్ట్రీ అంటేనే హీరో సెంట్రిక్. దాన్ని డైరెక్టర్ సెంట్రిక్ చేసిన దర్శక బాహుబలి రాజమౌళి. అందరు దర్శకులు హీరోల వెంట పడితే.. దానికి రివర్స్‌లో రాజమౌళి మాతోనే సినిమా తీస్తే బాగుండు అని హీరోలే ఆయన వెంట పడే స్థాయికి ఎదిగారు రాజమౌళి. తెల్ల దొరలకు వ్యతిరేకంగా తీసిన నాటు నాటు పాటను వాళ్ల చేతే ఈలలు వేయించిన ఘనుడు జక్కన్న. ఎవరినీ టీజ్ చేస్తూ ఈ ఆర్ఆర్ఆర్లో ఆ పాటను తెరకెక్కించాడే వాళ్లే రాజమౌళి తెరకెక్కించిన నాటు నాటు పాటకు సాహో అంటూ సలాములు కొడుతున్నారు. దటీజ్ రాజమఃళి.
ఇక రాజమౌళి నుంచి సినిమా వచ్చిందంటే ఎలా ఉంది అని అడగడం కాదు.. ఎంత బాగుంది అని అడగాలేమో..? అంతగా సంచలన విజయాలు అందుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు దర్శక ధీరుడు. భారత దేశంలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇదివరకు బాలీవుడ్ దర్శకుల వైపు చూసేవాళ్లు. లేదంటే శంకర్ వైపు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేనున్నానంటూ నెంబర్ వన్ స్థానంలో కొన్నేళ్లుగా కదలకుండా కూర్చున్నాడు దర్శక బాహుబలి రాజమౌళి. తెలుగు సినిమా నుంచి మొదలైన ఈయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఒక్కో సినిమాకు 400 కోట్ల బడ్జెట్ పెట్టించే స్థాయికి చేరిపోయాడు రాజమౌళి. (RRR Collections)
12. ట్రిపుల్ ఆర్: (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రూ. 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 272.31 కోట్లు షేర్ తెలంగాణ + ఏపీలో వచ్చింది. రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1215 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇప్పటి వరకు 21 ఏళ్లలో చేసిన 12సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అపజయం లేకుండా ముందుకు వెళ్తున్నాడు జక్కన్న. సై సినిమా మాత్రమే తక్కువ లాభాలు తీసుకొచ్చింది కానీ ఇది కూడా హిట్ సినిమానే. అపజయం లేకుండా రెండు దశాబ్ధాల కెరీర్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1150.10 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు) వసూళు చేసి దర్శకుడిగా సత్తా చాటాడు.
మొత్తంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని చిత్రాలకు అన్న కీరవాణి మ్యూజిక్ అందించారు. వీళ్ల కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్.. కాదు.. కాదు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మొత్తంగా రాజమౌళి, కీరవాణి.. టాలీవుడ్ హాట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పాలి. భవిష్యత్తులో వీళ్ల కాంబోలో మరిన్ని చిత్రాలు రావాలని ఆకాంక్షిద్దాం.. (Twitter/Photo)