దర్శక దిగ్గజం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఆన్లైన్ లో నెట్ ఫ్లిక్స్ ద్వారా మరింత రీచ్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, హాలీవుడ్ సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కించుకుంటుంది.
ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాను చూసి సెలబ్రిటీలు సైతం ప్రశంసలు వర్షం కురిపించారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ సినిమాల జాబితాలో నిలిచి ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది పది మంచి సినిమాలు లిఫ్ట్ చేసి వాటిలో ఒక దానికి ది బెస్ట్ మూవీ అని అవార్డు ప్రకటిస్తారు. అలా ఈ ఏడాది భారత దేశం నుంచి మన ఆర్ఆర్ఆర్ సినిమా చోటు దక్కించుకోవడం గమనార్హం.