Nizam Day 1 Top Share Movies: టాలీవుడ్లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన ’ఆర్ఆర్ఆర్’తో మరోసారి ఇదే జరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలతో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాంలో అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. (Twitter/Photo)
1 RRR | ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. అక్కడక్కడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తోన్న ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రూ. 23.35 కోట్ల రికార్డు కలెక్షన్స్‌తో అన్ని రికార్డులను మటాష్ చేసింది. ఇక సీడెడ్, ఏపీలో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ. 70 కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (Twitter/Photo)