ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అజయ్ దేవ్‌గణ్ మరో కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.(Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట అన్ని భాషల్లో కలిపి దాదాపు 75 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతేకాదు ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రచ్చ చేస్తోంది. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను చంద్రబోస్ రాసారు. కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమ్ రక్షిత్ అదిరిపోయే రీతిలో నృత్య రీతులు సమకూర్చారు. (Twitter/Photo)
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.(Twitter/Photo)
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆలియా భట్ .. సీత పాత్రలో నటించింది. (Twitter/Photo)
రాజమౌళి సినిమా కోసం అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా.. అక్కడ దాదాపు 9 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీకి ఆమె రావాలంటే అంత ఈజీ కాదు. ఈ చిత్రంలో ఆలియా పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. (Twitter/Photo)
ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. జనవరి 7, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. అన్ని భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది ట్రిపుల్ ఆర్. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా అలరించనున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. (Twitter/Photo)