ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)
ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది.
తాజాగా ఈ సినిమా అకాడమీ అవార్డుల బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఆస్కార్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్ )వసూళ్లను సాధించింది.
పలు అంతర్జాతీయ సినిమా వెబ్ సైట్లు కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నాయి. ‘‘ ఇండియా గత కొన్నేళ్లనుంచి ఆస్కార్ కోసం ఓ మంచి సినిమాను ఎంపిక చేయలేకపోతోంది. అయితే ఈసారి ఆర్ఆర్ఆర్తో ఆ కల నిజం అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1150.10 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు) రాబట్టింది.
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ కచ్చితంగా బెస్ట్ ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా, 1920 కాలంలో బ్రిటీష్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ ని అప్పట్లో ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు.
తాజాగా ‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా దర్శకుడు ఆర్ఆర్ఆర్ సినిమా పై కీలక వ్యాఖ్యలు చేశారు డాక్టర్ స్రేంజ్ సినిమా గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. మార్వెల్ కామిక్స్‌లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాన్ని స్కాట్ డెర్రిక్సన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ దర్శకుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్ల షేర్ (రూ. 1150.10 కోట్లు గ్రాస్) రాబట్టింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 160.06 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. మరి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఈ సినిమా ఇపుడు జపాన్ దేశంలో ఏ మేరకు కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి. (Twitter/Photo)