RRR | అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా.. ఆస్కార్‌కు ఒక విభాగంలో నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ.. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డుల్లో సత్తా చాటింది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో భాగంగా నాలుగు అవార్డులను గెలుచుకుంది.
కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక మన దేశంలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ 5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం), హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా వెస్ట్రర్న్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక జపనీస్ భాషల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తెగ ప్రమోషన్ చే సారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. Photo : Twitter
ఇప్పటికే RRR మూవీలోని నాటు నాటు పాటకు గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ రాగా.. ఇక నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చేసిన నాటు నాటు పాటను చంద్రబోస్ పాట రాయగా.. కీరవాణి స్వరాలు అందించారు. ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అద్భుతంగా పాట పాడారు. ఈ పాట తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రియులను అలరించింది. దక్షిణ భారత దేశం కాదు కాదు మన దేశం నుంచి నుంచి ఓ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ఇదే ప్రథమం. .Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ) సినిమాలవి నామినేట్ అయ్యాయి. చూడాలి మరి ఆస్కార్ అవార్డ్ ఏ పాటకు రానుందో.. ఇక నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ పేర్లను ప్రకటించింది అకాడమీ టీమ్. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డులలో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బొంబాయి (1988), లగాన్ (2001) చిత్రాలున్నాయి. ఈ అద్భుతమైన సాధించినందుకు ఆర్ఆర్ఆర్ బృందాన్ని అభినందిస్తున్నారు నెటిజన్స్. ఇక నాటు నాటు మిగితా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా లేదా అనేది మార్చి 13న తెలుస్తుంది. నాటు నాటుతో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్...ది ఎలిఫెంట్ విస్పర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్...అల్ ది బ్రీత్స్, ఇలా మూడు విభాగాల్లో ఇండియన్ సినిమాలు నామినేట్ అయ్యాయి. ఒకేసారి మూడు భారతీయ చిత్రాలు నామినేట్ కావడం ఇదే మొదటిసారి. Photo : Twitter