ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 7 నుంచి వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ టాలీవుడ్ టూ బాలీవుడ్ చాలా మంది ట్రేడ్ పండితులు ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ట్రిపుల్ ఆర్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం లాంఛనమే అని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే సంక్రాంతికి రాజమౌళి సినిమాతో పాటు ప్రభాస్ కూడా వస్తున్నాడు. ఈయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. జనవరి 14న ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్ కూడా జోరుగానే జరుగుతుంది. అయితే ట్రిపుల్ ఆర్ వాయిదా పడుతుందని తెలిసిన తర్వాత.. రాధే శ్యామ్ వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా అందరిలోనూ మొదలవుతున్నాయి.
ఎందుకంటే ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. దీని బడ్జెట్ కూడా 150 కోట్లకు పైగానే పెట్టారు. బిజినెస్ దాదాపు 250 కోట్ల వరకు జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ సినిమాకు కూడా నష్టాలు తప్పవు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, మధ్య ప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ సహా థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తుంది. మరోవైపు తమిళనాడులో కూడా జనవరి 1 నుంచి థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించింది ప్రభుత్వం.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తుంటే మాత్రం చివరి వరకు ఆ నమ్మకం అయితే కనిపించడం లేదు. బంగార్రాజు అయితే కచ్చితంగా పండక్కే వచ్చేలా కనిపిస్తుంది. ఇది మీడియం బడ్జెట్ సినిమా కావడం.. ఒకే భాషలో వస్తుండటంతో పెద్దగా సమస్యలు లేవు కానీ పెద్ద సినిమాలు.. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలకు మాత్రం కచ్చితంగా తిప్పలు తప్పవు. మరి చూడాలిక.. రాధే శ్యామ్ వస్తుందో లేదో..?
పూాజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సౌత్‌లో సంగీతం అందిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి.