RRR Roudram Ranam Rudhiram : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సహా హాలీవుడ్ నటీనటులు తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, ఒలివియా మోరీస్ సహా పలువురు నటీనటులు ఈ సినిమాతో టాలీవుడ్ గడప తొక్కుతున్నారు. (File/Photo)
అజయ్ దేవ్‌గణ్ | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్.. మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 1991లో ఫూల్ ఔర్ కాంటే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈయన .. రీసెంట్గా హీరోగా 30 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో తెరకెక్కించిన ‘ఈగ’ హిందీ వెర్షన్లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు జక్కన్న తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాను హిందీలో ‘సన్నాఫ్ సర్ధార్’గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇపుడు డైరెక్ట్‌గా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటించారు. ఈ సినిమాతో తొలిసారి టాలీవుడ్ తెరపై కనిపించనున్నారు. (Ajay Devgn look in RRR Photo : Twitter)
ఆలియా భట్ | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ‘సీత’ పాత్రతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తోంది. సరసన ఈ సినిమాలో జోడిగా నటించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే.. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. (Twitter/Photo)
ఒలివియా మోరీస్ | ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా ఆలియా భట్ పేరు ప్రకటించగానే.. సరసన ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐతే.. జక్కన్న మాత్రం మన దేశపు అమ్మాయి కాకుండా.. ఏకంగా విదేశీ అమ్మాయి ఒలివియా మోరీస్‌ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో ఈమెకు సామాజిక మాధ్యమాల్లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 7 ట్రైల్స్ ఇన్ 7 సిరీస్ అనే ఒకే ఒక్క సిరీస్‌లో నటించిన ఈ అమ్మడికి ఇపుడు జెన్నీఫర్ అనే బ్రిటిష్ యువతి పాత్రలో ఆర్ఆర్ఆర్ కనువిందు చేయనుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువే అని వినబడుతోంది. (Twitter/Photo)
అలిసన్ డూడి | ఆర్ఆర్ఆర్లో హీరోలను ఢీ కొట్టే లేడీ విలన్ పాత్రలో అలిసన్ డూడి నటించింది. ఫస్ట్ లుక్‌తోనే ఈ ఐరిష్ నటి తెలుగు సహా భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో లేడీ స్కాట్ అనే విలన్ పాత్రలో కనిపించనుంది. మోడల్ కమ్ నటి అయిన ఈమె జేమ్స్ బాండ్ మూవీ ‘ఏ వ్యూ టూ కిల్’ అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత ‘ఏ ప్రేయర్ ఫర్ ది డెయింగ్’, ‘డ్యూయల్ ఆఫ్ హార్స్’ వంటి పలు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటించింది. ఇపుడు ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. (Twitter/Photo)
రే స్టీవెన్సన్ | ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రధాన విలన్ రోల్ చేసిన నటుడు ఐరీష్ రే స్టీవెన్సన్. ‘ది థియరీ ఫ్లైట్’ అనే బ్రిటిష్ చిత్రంతో 1998లో నటుడిగా అరంగేట్రం చేసారు. ‘ఔట్ పోస్ట్’, ‘ది అదర్ గాయ్స్’, బిగ్గేమ్’, కోల్డ్స్కిన్’, ఫైనల్ స్కోర్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇపుడు ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్నారు. RRRమూవీతో ఫస్ట్ లుక్‌తోనే అట్రాక్ట్ చేశారు రే స్టీవెన్ సన్. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో శ్రియ, సముద్రఖని, రాజీవ్ కనకాల, అరుణ్ సాగర్, ఛత్రపతి శేఖర్, ఎడ్వర్డ్ సోనెన్బ్లిక్ వంటి వారు నటించారు. మొత్తంగా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)