ఏం చెప్పాలి.. ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమా మొదటి రోజు సృష్టించిన సంచలనాల గురించి మాటలు అయితే సరిపోవు.. గ్రంథాలు రాయాల్సిందే. ఒక్కో చోట కాదు.. అన్ని చోట్లా ఈ సినిమాకు భూమి కంపించే ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ అదరగొట్టింది. హిందీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ సంచలన కలెక్షన్స్ వసూలు చేసింది ట్రిపుల్ ఆర్. ఒకప్పుడు 10 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఏకంగా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల షేర్ వసూలు చేసింది. మొదటి రోజు 25 కోట్లకు పైగా వసూలు చేసాయి. బాహుబలి 2 నుంచి తాజాగా విడుదలైన ట్రిపుల్ ఆర్ వరకు తొలిరోజే 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసాయి.
12. రాధే శ్యామ్: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం.