RRR MOVIE DO YOU KNOW HOW MUCH IT COST FOR THE PROMOTION KNOW THE DETAILS EVK
RRR: అంత ఖర్చా.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌కు ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..?
RRR Movie | దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు చోట్ల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ప్రధానంగా సినిమా పరిశ్రమపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేసుకొంది.
1. ఆర్ఆర్ఆర్ సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుంటే జనవరి 7, 2022న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతుండడంతో సినిమాను నిరవదికంగా వాయిదా వేశారు. ఏప్రిల్‌లో విడుదల చేస్తాం అంటున్నారు.
2/ 8
2. ఇప్పటికే చాలా సార్లు సినిమా వాయిదా పడడంతో రాజమౌళి, చిత్ర బృందం సినిమా విడుదలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దీంతో ఈ సినిమా ప్రచారానికి చిత్ర బృందం చాలా కష్ట పడింది. భారీగా ప్రచారానికి ఖర్చు పెట్టారు.
3/ 8
3. ప్రచారంలో ఇద్దరు కథానాయకులు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తోపాటు రాజమౌళి పాల్గొన్నారు. బాలివుడ్ నటి అలియాబట్ కూడా దాదాపు అన్ని ప్రమోషన్లలో పాల్గొంది.
4/ 8
4. ఇటీవల, RRR యొక్క స్టార్ తారాగణం వార్తా ఛానెల్‌లకు అనేక ఇంటర్వ్యూలలో కనిపించింది. అన్ని భాషల్లో వెంటవెంటనే ఇంటర్వ్యూల ఇచ్చారు.
5/ 8
5. హిందీలో ఫేమస్ అయిన ది కపిల్ శర్మ షోలో కూడా సినిమా ప్రమోషన్ చేశారు. హిందీలోని బిగ్‌బాస్ సీజన్లోనూ సినిమా ప్రమోషన్లు చేశారు.
6/ 8
6. ఈ సినిమా ప్రమోషన్‌కు నిర్మాతలు 18 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇంత ఖర్చుతో ఓ చిన్న సినిమా తీసి రిలీజ్ చేయవచ్చని సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
7/ 8
7. ఇప్పుడు ఇంత ఖర్చు వృథా అయినట్టే అనే అభిప్రాయం చిత్ర వర్గాల్లో వెల్లడవుతుంది. ఎందుకంటే మళ్లీ విడుదల సమయంలో ప్రచారం చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.
8/ 8
8. ఈ సినిమా వాయిదాపై హీరోలు ఎటువంటి ట్వీట్ చేయలేదు. సినిమా వాయిదా పడడంతో చిత్ర బృందం కూడా ఒకంత నిరాశకు గురైంది. అనివార్య పరిస్థితుల కారణంగా సినిమాను విడుదల ఆగిందని ఫ్యాన్స్‌ను ఉత్సహ పరచడానికి త్వరలో వస్తామని చిత్ర బృందం తెలిపింది.