RRR | ప్రభాస్‌తో బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో రాజమౌళి రేంజ్ పెరిగింది. ఈయన సినిమా వస్తుందంటే ఆటోమేటిక్‌గా అంచనాలు అదే రేంజ్లో ఉంటాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో నందమూరి, మెగా హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కించిన మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఈ సినిమా అంచనాలు అదే రేంజ్లో ఉన్నాయి. మరి ఆ అంచనాలతో పాటు ఈ సినిమా గత కొన్నేళ్లుగా కొన్ని సినిమాలు ఫస్ట్ డే సెట్ చేసిన రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. (Twitter/Photo)
ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు.ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా ఫస్ట్ డే చాలా రికార్డులను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. (Twitter/Photo)
త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఒక సినిమాకు ఈయన 40 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడు. అలాంటిది త్రిబుల్ ఆర్ తర్వాత ఖచ్చితంగా అది 60 కోట్లకు చేరడం ఖాయం. అయితే కొరటాల శివ సినిమాకు డబ్బులు కాకుండా లాభాల్లో షేర్ తీసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్లతో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 ఫస్ట్ డే రూ. 43 కోట్లతో టాప్ ఓపెనర్‌గా ఉంది. ఈ రికార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేయడం ఈజీ అని చెప్పొచ్చు. RRR team in Kolkata Twitter
ఇక ఓవర్సీస్ అమెరికాలో ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా బాహుబలి సినిమా 2.45 మిలియన్ డాలర్స్ అందుకుంది. ఆ రికార్డును ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ క్రాస్ చేసింది. ఇక కర్ణాటలో బాహుబలి రూ. 19.60 కోట్ల గ్రాస్‌ను అందుకుని టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. (Twitter/Photo)