RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా మొదటి రెండు వారాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 వచ్చిన ఆర్ఆర్ఆర్ డీసెంట్ వసూళ్లనే సాధిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్స్‌కు ఎవరికీ సాధ్కం కానీ ఓ రికార్డును క్రియేట్ చేసారు. (Twitter/Photo)
ఆర్ఆర్ఆర్ బిజినెస్ చేసిన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా ఈ సినిమా రూ. 1120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం. (Twitter/Photo)
రీసెంట్గా ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ పాటలో రాజమౌళి, అజయ్ దేవ్‌గణ్, ఒలివియా మోరిస్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.ఆలియా భట్, ఒలివియా మోరీస్ కనిపించి కనువిందు చేశారు. (Twitter/Photo)
మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 600 కోట్ల పైబడి షేర్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టి మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టడం మాములు విషయం కాదు. మరో తెలుగు సినిమా ఈ రేంజ్లో షేర్ రాబట్టడం మాములు విషయం కాదు. బాహుబలి 2 తర్వాత రూ. 603.69 కోట్ల షేర్ రాబట్టిన భారతీయ సినిమాగా తన పేరు మీదు అరుదైన రికార్డును నమోదు చేసింది. (RRR Photo : Twitter)
మరి భవిష్యత్తులో కేజీఎఫ్ ఈ రేంజ్ అందుకోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1122.30 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లతో దూకుడు మీదుంది. త్వరలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలున్నాయి. ఈ సినిమా మే 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓ రికార్డు క్రియేట్ చేసారు. (Twitter/Photo)
RRR మూవీతో బాలీవుడ్లో ప్రభాస్, యశ్, రామ్ చరణ్‌కు సాధ్యం కానీ రికార్డు క్రియేట్ చేసారు. ఎన్టీఆర్ తొలి ప్యాన్ ఇండియా మూవీతో హిందీలో రూ. 250 కోట్లు వసూళు చేసిన డెబ్యూ హీరోగా రికార్డులకు ఎక్కారు. ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అక్కడ రూ. 150 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇక యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ మూవీ రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లనే రాబట్టింది. ఇక రామ్ చరణ్‌కు తొలి ప్యాన్ ఇండియా మూవీ అయినా.. అంతకు ముందు హిందీలో జంజీర్‌తో అక్కడి ప్రేక్షకులను పలకరించారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ అక్కడ రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లనే సాధించింది. (RRR Collections : Photo : Twitter)
ఈ రకంగా ఎన్టీఆర్ తొలి ప్యాన్ ఇండియా మూవీతో హిందీలో తొలి రూ. 250 కోట్లు అందుకున్న డెబ్యూ హీరోగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. భవిష్యత్తులో మహేష్ బాబు రాజమౌళి సినిమాతో.. పవన్ కళ్యాణ్ .. హరి హర వీరమల్లుతో తొలి ప్యాన్ ఇండియా మూవీస్‌తో హిందీలో ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేస్తారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)