RRR | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల పరంపరా విడుదలై తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత జీ 5లో తెలుగు,కన్నడ, మలయాళం,తమిళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా మలయాళ భాషలో అత్యధిక టీఆర్పీ సాధించిన తెలుగు డబ్బింగ్ చిత్రంగా అక్కడ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా అక్కడ 13.70 రేటింగ్ సాధించింది. (Twitter/Photo)