ఆ విషయంలో ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ ఆదర్శం.. అందుకే ఆ పని చేయబోతున్న తారక్..

టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు..ఒక వైపు యాక్టింగ్ చేస్తూనే...ఇంకోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిలో కొందరు బయటి హీరోలతో సినిమాలను తెరకెక్కించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతగా రంగంలోకి దిగబోతున్నాడు. అంతేకాదు తన బ్యానర్‌కు తన కొడుకు, తండ్రి కలిసొచ్చేలా భార్గవ్ హరి ప్రొడక్షన్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ రకంగా హీరో నుంచి నిర్మాతలుగా మారిన తెలుగు హీరోలెరున్నారో ఓ లుక్కేద్దాం.