Rajamouli:దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో ఒక్క ఛాన్స్ వచ్చినా.. అందులో చిన్న పాత్ర వచ్చినా చాలనుకునే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఇక బాలీవుడ్ అగ్ర హీరోలైన ఆమీర్ ఖాన్, షారుఖ్ వంటి హీరోలు కూడా జక్కన్న సినిమాలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బహిరంగంగ అడిగారు. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. ఇక బాహుబలి సినిమాను రాజమౌళి ముందుగా బాలీవుడ్ సెలిబ్రిటీస్తో తెరకెక్కిద్దామనుకున్నాడు. అక్కడ రాజమౌళి ఆఫర్‌ను అక్కడ స్టార్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమాను మన తెలుగు స్టార్స్‌తో తెరకెక్కించి దేశ వ్యాప్తంగా హిట్ కొట్టి దర్శకుడిగా తన సత్తా చాటాడు. ఇక రాజమౌళి సినిమాల్లో బాహుబలి సహా వేరే సినిమాల్లో ఛాన్స్ వచ్చిన మిస్ చేసుకున్న సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. వాళ్లు ఏయే పాత్రలను వద్దనుకున్నారో మీరు ఓ లుక్కేయండి.. (File/Photo)
శ్రీదేవి | శ్రీదేవి (బాహుబలి - శివగామి ) తెలుగువాడి సత్తాను ప్యాన్ ఇండియా లెవల్లో చూపించిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో ముందుగా శివగామి పాత్ర కోసం ముందుగా రాజమౌళి శ్రీదేవి సంప్రదించాడట. ఆమె ఎక్కువ పారితోషకం అడగటంతో ఆ ప్రాజెక్ట్ రమ్యకృష్ణను వరించింది. ఈ పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరెవరు చేయలేనంతగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. (File/Photo)
హృతిక్ రోషన్ | హృతిక్ రోషన్ (బాహుబలి ) బాహుబలి సినిమా అనుకున్నపుడే రాజమౌళి మదిలో ప్రభాస్ కంటే ముందు అనుకున్నది హృతికో రోషన్. ముందుగా బాలీవుడ్ ప్రాజెక్ట్ అనుకొని ఈ సినిమా కోసం హృతిక్‌ను సంప్రదించాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో తెలుగులో ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాడు రాజమౌళి. ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ ఎంతలా మారిపోయిందో తెలిసిందే కదా. (File/Photo)
నందమూరి బాలకృష్ణ | బాలకృష్ణ (మగధీర) ఇక రాజమౌళి.. రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాను ముందుగా బాలకృష్ణతో తెరకెక్కించాలనుకున్నట్టు అన్‌స్టాపబుల్ షోలో వెల్లడించారు. కానీ బాలయ్య ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమాను రామ్ చరణ్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఇండస్ట్రీగా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. (File/Photo)
పవన్ కళ్యాణ్ | పవన్ కళ్యాణ్ (విక్రమార్కుడు) ఇక రవితేజతో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాను రాజమౌళి పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాను రవితేజతో తెరకెక్కించిన సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఆ తర్వాత ఎన్నో భాషల్లో సూపర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. (File/Photo)
పరిణితీ చోప్రా | పరిణితీ చోప్రా ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ చేసిన సీతా పాత్ర కోసం ముందుగా పరిణితీ చోప్రా పేరును పరిశీలించారు. అటు ఓలివియా మోరీస్ పేరు కంటే ముందు పరిణితీ చోప్రా పేరును పరిశీలించారు. చివరగా రాజమౌళి ఈ క్యారెక్టర్ కోసం ఆలియాను తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్‌తో ఆలియా చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. (File/Photo)
కాజల్ అగర్వాల్ | కాజల్ అగర్వాల్ కిచ్లూ (యమ దొంగ) ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముందుగా ప్రియమణి పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ఈ పాత్ర ప్రియమణిని వరించింది. అందుకే రాజమౌళి.. రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘మగధీర’లో కాజల్‌ను ఫైనల్ చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. (File/Photo)