RRR | Oscars : ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్‌కి దక్కించుకోవడం భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్టైంది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నిర్మించడానికి డబ్బులు పెట్టిన నిర్మాత డీవీవీ దానయ్య పేరు ఎక్కడ వినిపించకపోవడంపై సర్వత్రా చర్చానీయాంశం అయింది.
ఒక సినిమాకు హీరో, హీరోయిన్లు దర్శకుడు ఎంత ముఖ్యమో.. పైసలు పెట్టే నిర్మాత అంతకంటే ముఖ్యం. ఒక సినిమాకు నిజమైన యజమాని అతనే. డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేసే నిర్మాత అనేవాడు లేకుంటే హీరోలు, స్టార్డమ్, దర్శకులు ఎవరు ఉండరు. ఇక మన దేశం తరుపున ఆస్కార్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు వేడుకలో ఎక్కడ నిర్మాత దానయ్య కనిపించలేదనేది అందరు చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యను కూరలో కరివేపాకులా తీసి పక్కనపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
తాజాగా ఆస్కార్ వేడుకలకు తాను ఎందుకు రాలేకపోయాననే విషయమై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు నిర్మాత డీవీవీ దానయ్య. తాను ముందు నుంచి పబ్లిసిటీకి దూరంగా ఉండే వ్యక్తినన్నారు. అందుకే ఆస్కార్ వేడుకలకు వెళ్లలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చేసిన ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)
2006 నుంచి రాజమౌళితో ప్రయాణం చేస్తున్నాను. ఆ టైమ్‌లోనే ఓ సినిమా చేయమంటూ ఆయనకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ‘మర్యాద రామన్న’ సినిమాకు నిర్మాతగా చేయమన్నాడు. నేను భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తానన్నారు. ఆ తర్వాత రెండు చిత్రాలు ఒప్పుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాను నందమూరి, మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్ సినిమా చేసినందకు రాజమౌళికి నేను ఎంతో రుణ పడి ఉన్నట్టు చెప్పారు. (Twitter/Photo)
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు చిరంజీవి పెట్టబడి పెట్టిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అలాంటి న్యూస్ ఎలా రాస్తారో అర్ధం కాదన్నారు. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆస్కార్ వేడుకకు రాజమౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనే విషయమై తనకు తెలియదన్నారు. తాను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదున్నారు. ఇక్కడ ప్రచారం చేసినట్టే అమెరికాలో జక్కన్న ప్రచారం చేయడానికి కొంత ఖర్చు చేసారు. అది ఎంత ఖర్చు చేసారనేది తెలియదన్నారు. (Twitter/Photo)
ఆర్ ఆర్ ఆర్.. సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డ్‌లను రివార్డ్‌లను దక్కించుకుంటోంది. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్‌కు కూడా గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది..Photo : Twitter
ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యిన ఆర్ ఆర్ ఆర్ నాలుగు ఇతర సినిమాల పాటలతో పోటీ పడి అవార్డ్ గెలిచింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. ఈ పాటలతో పోటీ పడి తెలుగు సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు సంగీత దర్శకుడిగా కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ అందుకున్నారు.. Photo : Twitter
ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డ్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు ‘ఎలిఫెంట్ విస్పర్స్’ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయింది. ఇక గతంలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న భారతీయుల విషయానికి వస్తే.. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా భాను అథయ్యా తొలి ఆస్కార్‌ను అందుకున్నారు. గాంధీ సినిమా మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా కాదు. ఇది ఓ ఇంగ్లీష్ సినిమా. ఈ సినిమాకు భాను అథయ్యా పనిచేయడంతో ఆమెకు ఆస్కార్ దక్కింది. ఇక ఆ తర్వాత బెంగాళీ దర్శకుడు సత్యజిత్ రే సినీ రంగానికి చేసిన విశేష సేవలకు 1992లో ఆస్కార్ అవార్డ్‌ను అందజేసింది అకాడమీ కమిటీ. Photo : Twitter
ఇక ఆ తర్వాత 81వ ఆస్కార్ వేడుకల్లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ఎ.ఆర్.రెహమాన్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు అవార్డులు వచ్చాయి. అంతేకాదు బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకోట్టికి దక్కింది. దీంతో పాటు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో లిరికిస్ట్ గుల్జార్ ఆస్కార్ సొంతం చేసుకున్నారు. అయితే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ కూడా హాలీవుడ్ సినిమానే. ఇక చివరగా.. 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కి ఆస్కార్ దక్కింది.. Photo : Twitter