ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. అక్కడక్కడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తోన్న ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. అంతేకాదు ఓవారాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయంలో నంబర్ స్థానంలో ఉంది. (RRR Photo : Twitter)
1 RRR | ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో తొలిరోజు రూ. 23.35 కోట్ల రికార్డు కలెక్షన్స్‌తో అన్ని రికార్డులను మటాష్ చేసింది. ఇక సీడెడ్, ఏపీలో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ. 70 కోట్ల వరకు షేర్ రాబట్టింది. మొత్తంగా నైజంతో పాటు ఏపీ, తెలంగాణలో ఈ సినిమా హైయ్యస్ట్ ఫస్ట్ డే గ్రాసర్‌గా టాప్ 1లో ఉంది. ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో రూ. 111.41 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచి నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పట్లో ఈ సినిమా రాబట్టిన షేర్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు లేవు. (Twitter/Photo)
2. బాహుబలి 2: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇదే హైయ్యస్ట్ డే 1 కలెక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 123 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్ బాహుబలి 2 రూ. 320 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ దెబ్బకు 2వ స్థానంలోకి పడిపోయింది. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 68 కోట్ల షేర్ రాబట్టి 2వ ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
3. అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ రేంజ్ మరింత పెంచేసిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.93 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 36.83 కోట్లను వసూళు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 159.2 కోట్ల షేర్‌తో నాల్గో ప్లేస్‌లో ఉంది. కానీ నైజాం (తెలంగాణ)లో మాత్రం రూ. 48.88 కోట్ల షేర్‌తో నైజాంలో టాప్ 3 హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. (twitter/Photo)
4.బాహుబలి: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో 2015లో విడుదలైన బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.46 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్ తాజాగా ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఈ సినిమా రూ. 194 కోట్ల షేర్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది. నైజాం (తెలంగాణ)లో ఈ సినిమా రూ. 43 కోట్ల షేర్‌తో నాల్గో స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
5. KGF Chapter 2 | కేజీఎఫ్ 2 మూవీ కన్నడతో పాటు తెలుగు, హిందీలో సహా ప్యాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక నైజాం (తెలంగాణ)లో ఈ పినిమా రూ. 41.78 కోట్ల షేర్ రాబట్టి టాప్ 5 లో నిలిచింది. ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్న డబ్బింగ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. Photo : Twitter
6. పుష్ప | అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.90 కోట్ల వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే విషయానికొస్తే.. 38.49 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రూ. 110.08 కోట్ల షేర్ రాబట్టి.. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఇక నైజాంలో ఈ సినిమా రూ. 40.74 కోట్ల షేర్‌తో టాప్ 6లో నిలిచింది. (Twitter/Photo)
8. భీమ్లా నాయక్: పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ అన్నీ తానేయై నడిపించిన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దానికి ఫలితమే ఫస్ట్ డే నైజాంలో రికార్డు కలెక్షన్స్. మొదటి రోజే రూ. 11.85 కోట్ల షేర్ వసూలు చేసింది భీమ్లా నాయక్. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రూ. 35.02 కోట్ల షేర్ రాబట్టి 8వ స్థానంలో నిలిచింది. (File/Photo)
14. రాధే శ్యామ్: చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ నటించిన లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఓ వర్గం ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపించారు. అయితే మరికొందరు మాత్రం ప్రభాస్‌ను ప్రేమకథలో చూడలేకపోతున్నారు. అందుకే వసూళ్లు కూడా అంతగా రావడం లేదు. ఈ చిత్రానికి నైజాంలో మొదటి రోజు రూ. 10.45 కోట్ల షేర్ వచ్చింది. ఇక తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 24.80 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నంబర్లో14వ ప్లేస్‌లో నిలిచింది.
21. భరత్ అను నేను | కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.52 కోట్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా రూ. 35.20 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగులో రూ. 101 కోట్లను రాబట్టి టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్ లిస్టులో 12వ స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 21.42 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 21 స్థానంలో నిలిచింది. (File/Photo)
అఖండ | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు పెద్ద హీరోల సినిమాలు బాగుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే విషయం ఈ సినిమాతో స్పష్టమైంది. ఇక తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 21.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 22వ స్థానంలో నిలిచింది. (twitter/Photo)