RRR: తెలుగు సినిమాకు జాతీయ అవార్డులు రావడమే మహా గొప్పగా భావించే తరుణంలో ప్రపంచ యవనికపై రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌తో అసాధ్యమనుకున్న ఆస్కార్‌ను మన దేశానికి తీసుకొచ్చారు. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటకు స్వరకర్త కీరవాణితో పాటు పాటల రచయత చంద్రబోస్ ఈ అవార్డు అందున్నారు. ఈ పాటను సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అదే ఊపులో పాడిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా పాట విషయంలో సింగర్ కాల భైరవ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు (Naatu Naatu won the Oscar) ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది.
కాల భైరవ ట్వీట్ చేసిన పోస్టులో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసారు. అంతేకాదు ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం జీవితంలో మరిచిపోలేని సంఘటనగా చెప్పారు. ఇది కొంత మంది వల్లే సాధ్యమైంది అంటూ తనకు గాయకుడిగా ఛాన్స్ ఇచ్చిన రాజమౌళి బాబా, నాన్న , ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మకి ధన్యవాాదాలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా అందరికీ దగ్గరైన విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)
కాల బైరవ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఈ పాటలో డాన్స్ చేసిన హీరోలైన , పేర్లు ప్రస్తావించకపోవడంపై ఆయా హీరోల అభిమానులు ఓ రేంజ్లో కాల భైరవపై ఒంటి కాలువపై లేచారు. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట కంటే మిగతా పాటలు కూడా పాపులర్ అయ్యాయి. నాటు నాటు పాట ఈ రేంజ్లో పాపులర్ కావడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డాన్సులు కారణం అంటూ చెప్పుకొచ్చారు.
నాటు నాటు పాటలో ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్నల పాత్రను తీసిపారేయానికి ఏమి లేదు. నిస్సందేహంగా వాళ్లిద్దరి డాన్స్ కారణంగా నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ పై లైవ్ పర్ఫామెన్స్ చేయడానికి నాకు సాయం చేసిన వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. అంతేకాదు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను తక్కువ చేయడం తన ఉద్దేశ్యం కాదు. ఏది ఏమైనా అభిమానుల మనసు నొప్పించినందుకు సారీ చెబుతున్నట్టు ట్వీట్ చేసారు. దీంతో అభిమానులు శాంతించారు. (Twitter/Photo)