సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది అంటే ఏమో అనుకున్నాం.. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ఒక్కరోజు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. పరిస్థితులు చూసుకుని ఏదో ఒక రోజు విడుదల చేస్తాము అంటున్నారు దర్శక నిర్మాతలు. అప్డేట్ అవ్వాలి కానీ మరీ ఇంతలా కన్ఫ్యూజ్ చేసేంత అప్డేట్ మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు.
బయట పరిస్థితులు చూసుకొని బాగుంటే ఇప్పుడు వస్తాం.. లేదంటే అప్పుడు వస్తామంటూ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తే తమ సినిమాను ముందు చెప్పినట్టు ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని.. లేదంటే ఏప్రిల్ 1కి వస్తామని ప్రకటన విడుదల చేశాడు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.
ఇప్పుడు ఇదే ఫార్మేట్ వరుణ్ తేజ్ కూడా ఫాలో అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న గని సినిమా కోసం 2 రిలీజ్ డేట్స్ లాక్ చేశారు నిర్మాతలు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. బాక్స్ నేపథ్యంలో గని సినిమా వస్తుంది. వాళ్లు కూడా కుదిరితే ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4 అంటున్నారు.
మిగిలిన సినిమాలతో పోటీ పడకుండా అన్ని చూసుకుని తీరిగ్గా వస్తామంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు గని యూనిట్. పరిస్థితులు చూస్తుంటే ఇకపై వచ్చే సినిమాలు కూడా ఇలాగే 2-2 విడుదల తేదీలతో వస్తాయేమో. తమకు పరిస్థితులు ఎప్పుడు బాగుంటే అప్పుడు తమ సినిమాను విడుదల చేస్తామని ముందుగానే తమకు నచ్చిన రిలీజ్ డేట్స్పై ఖర్చీఫ్ వేస్తున్నారు నిర్మాతలు.
మొత్తానికి రాజమౌళి మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో బాగానే పాపులర్ అవుతుంది. కానీ బయట చూసే వాళ్లకు మాత్రం ఈ రెండు రిలీజ్ డేట్స్ ఫాంటసీ ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒక సినిమాకు ఇలా రెండు రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించుకుంటూ పోతే.. కచ్చితంగా ఫ్యూచర్లో ఇదే ట్రెండ్ అవుతుంది. అప్పుడు విడుదల తేదీల విషయంలో మరింత కన్ఫ్యూజన్ తప్పదు.