రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హజరైన రామ్ చరణ్ వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందంటూ.. దేశ భద్రతను కాపాడుతున్న సైనికుల త్యాగాలను గౌరవించుకోవాంటూ పేర్కోన్నారు.
దేశం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను ఎప్పుడూ, ఎవరూ మరిచిపోవద్దు అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక రామ్‌చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన తాజా సినిమా ఆర్ ఆర్ ఆర్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రామ్ నటించిన మరో సినిమా ఆచార్య. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్వకత్వం వహించారు. చరణ్ ఈ చిత్రంలో సిద్ద అనే కీలకపాత్రలో నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది.
అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాటు నాటు, కొమ్మ ఉయ్యాల వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. మరో పాట దోస్తీ విడుదలైంది. ఈ పాటను సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాయగా.. హేమచంద్ర పాడారు. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు.