Hombale Films: బాలీవుడ్ స్టార్ హీరోతో హోంబలే ఫిల్మ్స్ సినిమా.. కీలక పాత్రలో రిషబ్ శెట్టి ?
Hombale Films: బాలీవుడ్ స్టార్ హీరోతో హోంబలే ఫిల్మ్స్ సినిమా.. కీలక పాత్రలో రిషబ్ శెట్టి ?
కాంతార, కేజీఎఫ్ వంటి సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే సంస్థ. తాజాగా ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్లో సినిమా తీయడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ మూవీలో రిషబ్ శెట్టి కూడా నటిస్తున్నట్లు టాక్.
కేజీఎఫ్, కాంతార వంటి హిట్ చిత్రాలను అందించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్లో ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.
2/ 7
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోసం హోంబాలే ఫిలింస్ ఓ సినిమా చేయబోతోందని ఓ వార్త వినిపిస్తోంది. దీంతో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3/ 7
ఇప్పటికే షారుఖ్‌తో హోంబాలే ఫిలింస్ చర్చలు జరిపినట్లు సమాచారం. షారుఖ్ రాబోయే చిత్రం హోంబాలేకి రోహిత్ శెట్టి డైరెక్టర్ అని సమాచారం. అతడే యాక్షన్ కట్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
4/ 7
రిషబ్ శెట్టి కూడా హొంబాలేతో బాలీవుడ్‌కి వెళ్తాడా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. రక్షిత్ శెట్టి, కాంతార హీరోలు కూడా నటించబోతున్నారనేది సమాచారం. దీంతో కాంతార అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
5/ 7
ఈ మధ్య కాలంలో ఓ స్టార్ హీరో సినిమాాలో మరో స్టార్ హీరో నటించడం ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలోనే.. షారుఖ్ సినిమాలో రక్షిత్, రిషబ్ గెస్ట్ రోల్స్‌లో నటిస్తున్నారని ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.
6/ 7
మరికొద్ది రోజుల్లో ఈ మెగా ప్రాజెక్ట్ ని హోంబాలే ఫిలింస్ అనౌన్స్ చేయనుందని అంటున్నారు.
7/ 7
షారుఖ్ సినిమాలో నటించేందుకు రక్షిత్, రిషబ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రక్షిత్, రిషబ్ ల కోసం రోహిత్ శెట్టి ప్రత్యేక పాత్ర డిజైన్ చేశారని కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.