Rithu Chowdary: రీతూ చౌదరి.. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో కు వచ్చిన రీతూ చౌదరి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ షో తర్వాత రీతూ చౌదరి సీరియల్స్ లోకి వచ్చి సీరియల్ నటి సక్సెస్ అయ్యింది. సీరియల్ లో లేడీ విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చి ఓ స్కిట్ చేసింది. ఆ స్కిట్ చూస్తే ఎవరైనా సరే వామ్మో అనకుండా ఉండలేరు. ఆ స్కిట్ లో అమ్మాయిలు అబ్బాయిలుగా.. అబ్బాయిలు అమ్మాయిలుగా చేసే ఈ స్కిట్ లో మ్యాటర్ మ్యాటర్ అంటూ అసభ్యకరమైన పదజాలంతో షో ని గబ్బు పట్టించారు. ప్రస్తుతం ఈ స్కిట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.