Guppedantha Manasu: బుల్లితెరలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో డీజీపీ భార్య జగతిని వ్రతానికి పిలిచినప్పుడు ఆవిడ అన్న మాటలను తలచుకుని బాధ పడుతుండగా మహేంద్ర ఓదార్చుతాడు. అదే సమయములో వసు వచ్చి రిషి తన పెళ్లి గురించి టాపిక్ తీశాడని చెప్పేసరికి జగతి భయపడుతుంది. ఇక డీజీపీ భార్య దేవయానిని కూడా వ్రతానికి ఆహ్వానిస్తుంది. అంతేకాకుండా అక్కడ మహేంద్ర ఉన్నాడనే విషయాన్ని చెప్పేసరికి దేవయాని షాక్ అవుతుంది. ఈ విషయాన్ని తన భర్త ఫణీంద్రకు చెప్పి పెద్దగా చేస్తుంది. అంతేకాకుండా రిషి కూడా చెబుతుంది. ఇక రిషి జగతితో వసు గురించి మాట్లాడుతూ.. లేనివి ఊహించి ప్రేమ కథ సిద్ధం చేశారు కదా అంటూ తిడుతాడు.