కాంతార సినిమా ప్రస్తుతం ఎక్కువగా జనం నోట్లో నానుతున్న సినిమా. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
కాంతార సినిమాలో పంజుర్లీ దేవత గురించి ప్రత్యేకంగా చూపించారు. ఆ దేవతను తన మనస్సాంతి కోసం ఓ రాజు అడవిలో ఉండే ప్రజల్ని అడగడం... వారు ఇవ్వడం.. వారి మధ్య దేవతను ఇచ్చే విషయమే.. కుదిరిని ఒప్పందం ఇలా ఎన్నో అంశాలతో కాంతార సినిమా ముడిపడి ఉంటుంది. సినిమాలో కూడా అడవిలో ఉండే ప్రజలు పంజుర్లీ దేవతను ఆరాధిస్తుంటారు. Kantara Day 1 Collections (Photo Twitter)
అంతేకాదు తమ ప్రాంతంలో అలా దేవత ఆవహించిన వ్యక్తులను సైతం తాను తన కళ్లతో చూశానని ఆయన అన్నారు. అలా తన అనుభవాల ద్వారా కాంతార క్లైమాక్స్ ఏ విధంగా ఉండాలో రాసి పెట్టుకున్నానని రిషబ్ చెప్పుకొచ్చారు.మనసులోనే తీయాల్సిన సీన్లను విజువల్స్ ఎలా ఉండాలో కూడా తాను సిద్ధం చేసుకుని కాంతార మూవీ క్లైమాక్స్ ను తెరకెక్కించానని రిషబ్ తెలిపారు.