Kantara Movie: రిషబ్ శెట్టి కాంతార మరో రికార్డ్... ఆనందంలో అభిమానులు..!
Kantara Movie: రిషబ్ శెట్టి కాంతార మరో రికార్డ్... ఆనందంలో అభిమానులు..!
కన్నడ సినిమా కాంతార దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. కాంతార ఇతర భాషాల్లో కూడా విడుదలై తన సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డు సొంతం చేసుకుంది.
రిషబ్ శెట్టి కథ రాసి, దర్శకత్వం వహించి, నటించిన కాంతార సినిమా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా కాంతార మూవీ ఇప్పుడు మరో రికార్డు సృష్టించి సర్వత్రా వార్తల్లో నిలుస్తోంది.
2/ 7
ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. విస్తృత ప్రశంసలను అందుకున్న కాంతార సినిమా టోటల్ కలెక్షన్ 400 కోట్ల మార్కును దాటేసింది.
3/ 7
ఒక్క కర్ణాటకలోనే కాంతార సినిమా 168 కోట్లు రాబట్టింది. కాంతారావు సినిమా విడుదలైన దాదాపు అన్ని థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా రన్ అయ్యింది.
4/ 7
తాజగా కాంతార సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా బెంగుళూరులోనే.. ఈ సినిమాకు సంబంధించి 20వేల షోలు వేశారు. ఇంతవరకు మరి ఏ సినిమాకు కూడా ఈ ప్రత్యేకమైన రికార్డు దక్కలేదు.
5/ 7
బెంగుళూరులో సింగిల్ స్క్రీన్ మరియు మల్టీప్లెక్స్‌లో కలిపి 20,000 షోలు ప్రదర్శించారు. ఇది కాంతారకు దక్కిన మరో గొప్ప విజయం అని ఆ సినిమా టీం అంటోంది.
6/ 7
ఇప్పుడు సినిమా OTTలో కూడా విడుదలైంది, నవంబర్ 24 నుంచి కాంతార ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతుంది. జనం సినిమాలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు.
7/ 7
కాంతార లాగానే తన హవా సృష్టించిన కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా బెంగుళూరులో 17వేల షోలు ప్రదర్శించారు. ఇప్పుడు కాంతార ఆ కేజీఎఫ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది.