కాంతార సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించి ఆయనే దర్శకత్వం కూడా వహించారు. సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. కేవలం రూపాయలు 16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 400.90 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార సినిమాలో కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.