కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదలై ఎవరు ఊహించనంత రేంజ్లో వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. ఈ సినిమా తెలుగు, కన్నడలోనే కాదు అటు హిందీలో కూడా ఇరగదీసింది. ప్రస్తుతం ఈసినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది. తాజాగా రేటింగ్ కూడా వచ్చింది. . Photo : Twitter
రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. 2022 అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు తాజాగా ఓటీటీలో చూసి అసలు ఏముంది రా బాబు.. ఈ సినిమాలో అంటూ ఇంత పెద్ద హిట్ అయ్యిందని అంటున్నారు. Photo : Twitter
కాంతార డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. దీంతో ఈ సినిమా ను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు తమ ఇంట్లో చూస్తూ కొందరు ఎంజాయ్ చేస్తున్నారు.. Photo : Twitter
అది అలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఇంగ్లీష్ భాషలోను డబ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో అందుబాటులో ఉండగా.. ఇక లేటెస్ట్గా ఈ సినిమాలను నిర్మాతలు ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఆ ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్‌లో విడుదలకానుందా లేక ఓటీటీకే పరిమితం కానుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. ఇక షేర్ 30 కోట్లకు ఉండోచ్చని, ఇక ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు గ్రాస్ వసూలు అయ్యిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. ఇక ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. అగ్నీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కెజీయఫ్ నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రోడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్‌ను అల్లు అరవింద్ కేవలం రెండు కోట్లకు కొన్నారట. దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని అల్లు అరవింద్‌కు కాంతార కాసుల వర్షాన్ని కురిపించింది. Photo : Twitter
సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన ‘కాంతార’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుని ఇప్పటికీ కన్నడ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీతోనే.. జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. తెలుగులో కూడా విడుదలైన కాంతార మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. Photo : Twitter
కాంతార హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి యూనిక్ స్టొరీ పాయింట్ ని కంప్లీట్ రా అండ్ రగ్గుడ్గా తెరకిక్కించగా తన పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా మిగిలిన యాక్టర్స్ అందరూ ఆకట్టుకున్నారు, సినిమా మొదటి పావుగంట అలాగే చివరి 30 నిమిషాలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా 1847 బ్యాక్‌డ్రాప్ మొదలవుతోంది. అపుడు మన దేశంలో ఇంకా వివిధ రాజ్యాలు పాలన చేస్తూ ఉంటాయి. అందులో ఒక రాజ్యానికి చెందిన రాజుకు ఎన్ని దాన ధర్మాలు చేసిన పూజలు చేసిన ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. ఈ క్రమంలో రాజ పురోహితులు చెప్పిన ప్రకారాం ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరుతారు. Photo : Twitter
ఇక కొన్ని తరాల తర్వాత ఆటవిక ప్రాంతానికి ఇచ్చిన భూమిపై రాజు గారి వారసుల కన్ను పడుతోంది. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఆ రాజు వారసులు ఆ అటవి ప్రాంతానికి చెందిన భూమికి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో దైవశక్తి వారికి అడ్డు తగులుతుంది . ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఈ ‘కాంతార’ మూవీ స్టోరీ.