కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరో నటించి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ నుంచి వచ్చిన ఈ మూవీ సైలంట్ హిట్ కొట్టింది. తెలుగు హిందీ భాషాల్లో కూడా మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ అయిన దగ్గరి నుంచి సినీ ప్రియులు దీని సీక్వెల్ కోసం ఎదరుచూస్తున్నారు.
[caption id="attachment_1533986" align="alignnone" width="1080"] కాంతార రెండో భాగం 2024లో విడుదలవుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇది కాంతారకు సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని పేర్కొన్నారు. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపనున్నట్లు చెప్పారు.